ETV Bharat / entertainment

డార్లింగ్ ఫ్యాన్స్ గెట్​ రెడీ- 'కల్కి' సాలిడ్ అప్డేట్!- రిలీజ్​పై క్లారిటీ అప్పుడే! - Kalki Release Date - KALKI RELEASE DATE

Kalki Latest Update: ప్రభాస్- నాగ్​అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'కల్కీ 2898 AD'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ గురించి సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఆదివారం ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్​ చేశారు.

Kalki Latest Updates
Kalki Latest Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:26 AM IST

Updated : Apr 21, 2024, 9:22 AM IST

Kalki Latest Update: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'కల్కీ 2898 AD'. అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. అయితే ముందుగా అనౌన్స్​ చేసిన ప్రకారం కల్కి వచ్చే నేల (మే) 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కల్కి రిలీజ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి సమయంలో మూవీ మేకర్స్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది. సినిమా నుంచి మేకర్స్​ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​కు 'అతడు ఎవరో తెలుసుకునే సమయం వచ్చింది' అనే క్యాప్షన్ జోడించారు. ఆదివారం (ఏప్రిల్ 21) సాయంత్రం 7.30 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్​ (@StarSportsIndia)లో ఈ అప్డేట్​ ఇవ్వనున్నట్లు మెన్షన్ చేశారు. ఈ ఛానెల్​లో ఈ పోస్టర్​లో ఓ నటుడు సాధువు గెటప్​లో ఉన్నాడు. అతడి ఫేస్ ముసుగుతో కవర్ చేసి ఉంది. అతడు ఎవరో తెలుసుకునే సమయం వచ్చింది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ, ఆయన బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ అని ఈజీగా అర్థమైపోతుందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం ఈ అప్డేట్​తోపాటు మూవీ రిలీజ్ డేట్​పై కూడా క్లారిటీ ఇస్తారని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. చూడాలి మరి కల్కి మేకర్స్ ఇచ్చే అప్డేట్ ఎంటో?

రిలీజ్​పై క్లారిటీ పక్కా: అయితే కల్కి ప్రొడ్యూసర్లు రీసెంట్​గా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారట. ఈ మీటింగ్​లో మెయిన్​గా సినిమా విడుదలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో మూవీటీమ్ రిలీడ్ డేట్​పై ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. అందుకే ఇదే అప్డేట్​లో రిలీజ్​పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ మైథలాజికల్ సైన్స్​ఫిక్షన్​ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్​తోపాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దీశా పటానీ సినిమాలో లీడ్ రోల్స్​లో నటిస్తున్నారు. వీరితోపాటు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు ఆయా పాత్రలు పోషించనున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్​పై తెరకెక్కుతునన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

'కల్కి' రూమర్స్​కు చెక్- రిలీజ్​పై క్లారిటీ ఇవ్వనున్న మూవీటీమ్! - Kalki 2898 Ad Release

'కల్కి'పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్​ - ఆ స్థాయిలో లేరంటూ! - Prabhas Kalki 2898 AD

Last Updated : Apr 21, 2024, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.