Kalki 2898 AD To Thangalaan Top 10 IMDB Movies : ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ పెద్ద హీరోల చిత్రాలు మాత్రం సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు రాలేదు. సమ్మర్ సీజన్ డ్రైగానే ముగిసిపోయింది. ఆ మధ్య చిన్న సినిమాల్లో డీజే టిల్లు స్క్వేర్ మాత్రమే భారీ హిట్‌ను అందుకుంది. దాదాపు రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికలు, ఐపీఎల్ ఫీవర్, దానికి తోడు ఎండలు మండిపోతుండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమాల సందడి కనపడట్లేదు.
బడా హీరోల సినిమాలన్నీ జూన్ తర్వాతే వరుసగా బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. తాజాగా వాయిదా పడుతూ వస్తోన్న కల్కి కూడా రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కాబోయే కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిపింది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb). అత్యధికమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ కల్కి 2898 ఏడీనే (Kalki 2898 AD) టాప్‌లో నిలవడం విశేషం. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొణె, అమితాబ్, కమల్‌హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి తెలుగు సినిమా కూడా ఇదొక్కటే. దేవర, గేమ్ ఛేంజర్, పుష్ప 2 ఇవేమీ చోటు దక్కించుకోలేదు.
ఇక కల్కి తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్‌సిరీస్ హీరా మండి: ది డైమండ్ బజార్ (Heeramandi) రెండో స్థానంలో ఉంది. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదాషేక్, కీలకపాత్రలు పోషిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక టాప్-3లో తమిళ కామెడీ హారర్ థిల్లర్, రాశీ ఖన్నా నటించిన అరణ్మణై4(Aranmanai 4) ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదే జాబితా
- కల్కి 2898 ఏడీ
- హీరా మండి: ది డైమండ్ బజార్
- అరణ్మణై 4
- శ్రీకాంత్
- తంగలాన్
- నడిగర్
- మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ
- టర్బో
- గురువయ్యూర్ అంబల నాయిదల్
- మలయాళీ ఫ్రమ్ ఇండియా
ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే - Kalki 2898 AD Release Date