ETV Bharat / entertainment

'కల్కి' నుంచి కాంప్లెక్స్‌ సాంగ్‌ రిలీజ్ - సినిమాపై రజనీకాంత్​ రివ్యూ - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE

Kalki 2898 AD Movie Review by Rajinikanth : 'కల్కి 2898 ఏడీ' సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్​, మన్మథుడు నాగార్జున వీక్షించారు. సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. అలానే తాజాగా ఈ చిత్రం నుంచి టక టక్కర అని కాంప్లెక్స్‌లో సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Kalki 2898 AD Rajinikanth (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 2:23 PM IST

Kalki 2898 AD Movie Review by Rajinikanth : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తొలి రోజే రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్​, మన్మథుడు నాగార్జున వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.‘

కల్కి సినిమా అద్భుతంగా ఉంది. ఇండియన్‌ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. మూవీలో నటించిన ప్రతిఒక్కరికీ, సినిమా కోసం పనిచేసిన అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈ మూవో సెకండ్ పార్ట్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని రజనీ కాంత్‌ అన్నారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ బదులిచ్చారు. మాటలు రావడం లేదన్నారు. టీమ్‌ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పారు.

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా సోషల్‌ మీడియా వేదికగా కల్కి టీమ్​క అభినందనలు తెలిపారు. నాగ్‌ అశ్విన్‌ మిమ్మల్ని ఒకసారి కలవాలి. బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్​ మీరు అసలైన మాస్‌ హీరో. మీ యాక్టింగ్​తో మరోసారి ఆశ్చర్యపరిచారు. రెండో భాగంలో కమల్‌ హాసన్‌ను చూడడం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ నువ్వు మరోసారి సత్తా అదరగొట్టావు. దీపికా చాలా అద్భుతంగా నటించింది. మీరంతా కలిసి ఇండియన్‌ సినిమా స్థాయి ఏంటో మరోసారి నిరూపించారు అని కొనియాడారు. కాగా, సినిమాలో ప్రభాస్‌, అమితాబ్ యాక్షన్‌ సీన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.

Kalki 2898 AD Ta Takkara Song Release : ఇకపోతే ఈ చిత్రం నుంచి టక టక్కర అని కాంప్లెక్స్‌లో సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచంలో ఉన్న వనరులన్నీ కలిగిన కాంప్లెక్స్‌కు భైరవ (ప్రభాస్‌), రోక్సీ (దిశా పటానీ) వెళ్తారు. అలా అక్కడకు వెళ్లాక వాళ్లు చూసిన వింతలేంటి? ఎలాంటి అనుభూతిని పొందారో ఈ సాంగ్‌లో అద్భుతంగా చూపించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి.

'స్పిరిట్'లో ప్రభాస్ లుక్ ఇదే - డార్లింగ్​కు సందీప్ వంగా సూచనలు! - Prabhas Spirit Movie

రజనీకాంత్‌, కమల్​హాసన్​తో శంకర్​ సినిమాటిక్‌ యూనివర్స్‌! - Indian 2 Director Shankar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.