ETV Bharat / entertainment

OTTలోకి 'కల్కి' ఎంట్రీ- తెలుగు వెర్షన్​ అందులోనే! - KALKI 2898 AD - KALKI 2898 AD

KALKI 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ లీడ్ రోల్​లో నటించిన 'కల్కి' ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నెట్​ఫ్లిక్స్, ​అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Kalki OTT
Kalki OTT (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 8:15 AM IST

KALKI 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'కల్కి' ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ బ్లాక్​బస్టర్ మూవీ గురువారం అర్ధరాత్రి నుంచి నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్​ఫ్లిక్స్​లో హిందీ వెర్షన్​, అమెజాన్​లో తెలుగుతోపాటు సౌత్​ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ఆయా ఓటీటీ ప్లాట్​ఫామ్స్ అఫీషియల్​గా అనౌన్స్ చేశాయి.

కాగా, జూన్ 27న రిలీజైన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.1100+ కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలోనే కల్కి పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ దక్కించుకోవడం పక్కా అని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ముగిసిన రికార్డుల వేట ఇకపై ఓటీటీలో ప్రారంభం కానుంది.

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్​తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్​తోపాటు సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. బీటౌన్ భామలు దీపికా పదుకొణె, దిశా పటానీ, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉండనుంది.

Kalki 50 Days Nag Ashwin: ఈ సినిమా ఆగస్టు 15న 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఆడియెన్స్​కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే 50 డేస్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్​గా జరిగాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్​ సంధ్య థియేటర్ (Sandhya RTC X Road)లో గ్రాండ్​గా సెలబ్రేషన్స్ నిర్వహించారు.

డైరెక్టర్​ నాగ్ అశ్విన్ ఫ్యామిలీతోపాటు ఈ సెలబ్రేషన్స్​లో పాల్గొన్నారు. ఆయన అభిమానుల మధ్య సినిమా చూశారు. ఫ్యాన్స్​తోపాటు నాగ్ అశ్విన్ కేరింతలు కొడుతూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక థియేటర్ యాజమాన్యం ఆయనను శాలువాతో సత్కరించింది. అనంతరం అశ్విన్ భారీ కేక్ కట్ చేశారు.

గ్రాండ్​గా 'కల్కి' 50డేస్ సెలబ్రేషన్స్- థియేటర్లో నాగ్ అశ్విన్ హంగామా! - Kalki 50 Days Celebration

'కల్కి 2'లో భైరవకు తోడుగా దుల్కర్​, విజయ్ దేవరకొండ : నాగ్ అశ్విన్ సమాధానమిదే - NagAshwin on Kalki Part 2 Rumours

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.