Kalki 2898 AD Nag Ashwin Vijay Devarkonda Old look : 'కల్కీ 2898 ఏడీ' - ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. కారణం భారీ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్‌తో పాటు మరికొంతమంది గెస్ట్ రోల్స్ చేశారు. వారిలో విజయ దేవరకొండ ఒకరు. ఆయన్న అర్జునుడిగా చూపించారు నాగ్. అయితే ప్రస్తుతం వీరిద్దరి ఫ్రెండ్ షిప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి దిగిన ఓల్డ్ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో నాగ్ అశ్విన్ చాలా బక్కగా, పెద్ద జుట్టుతో ఉన్నారు. విజయ్ దేవరకొండ కూడా చిన్న పిల్లాడిలా, సన్నగా కనిపించారు. ఏదో పార్టీలో ఆ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. అయితే నాగ్ అశ్విన్‌ను చూసిన వారంతా వెరైటీగా ఉన్నాడే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, నాగ్ అశ్విన్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, రెండో చిత్రంలో మహానటిలోనూ విజయ్ దేవరకొండ నటించారు.
Friendship goals ❤️#VijayDeverakonda #NagAshwin #Kalki2898AD #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/7eMIAfcuZl
— Shreyas Sriniwaas (@shreyasmedia) July 1, 2024
Nandamuri Mokshagna New Look : ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోల వారసుల ఎంట్రీ గురించి తెగ చర్చ జరుగుతోంది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వారసులు వెండితెర అరంగేట్రం ఎప్పుడు చేస్తారా అని అంతా తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వీరి ఎంట్రీ కన్నా ఎక్కువగా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి మరింత ఎక్కువగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు! ఈయన ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్ల నుంచి చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మోక్షజ్ లేటెస్ట్ లుక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన కళ్లజోడు పెట్టుకుని, పసుపు రంగు టీషర్ట్‌లో కనిపించారు. ఆ ఫొటోకు "వస్తున్నా. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి" అంటూ క్యాప్షన్ కూడా రాసి ఉంది. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏ సినిమాతో రాబోతున్నాడు? దర్శకుడు ఎవరు? అంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ ట్వీట్ అఫీషియల్ కాదు.
వస్తున్నా......♥️👍
— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) July 1, 2024
Need All Your Blessings 🙏 #DebutOfMokshagnaTeja #NBK #balayya #NandamuriBalakrishna pic.twitter.com/Fbe8qr2ECV
థియేటర్లలో ఈ నెలంతా ఈ ముద్దుగుమ్మలదే సందడి! - July 2024 Release Movies Telugu
'కల్కి'లో ఈ హీరో ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదట! - Kalki 2898 AD Movie