ETV Bharat / entertainment

'కల్కి' మూవీకి వెళ్తున్నారా? ఈ 14 విషయాలు తెలిస్తే సినిమా చూడటం వెరీ ఈజీ! - Kalki 2898 AD

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 6:39 PM IST

Kalki 2898 AD Interesting Facts : సినీ ఇండస్ట్రీ నుంచి మూవీ లవర్స్​ వరకూ ఇప్పుడు అందరి నోట నానుతున్న ఒక్కే ఒక పేరు 'కల్కి 2898 AD'. రోజుకో కొత్త అప్​డేట్​తో భారీ అంచనాలు పెంచేస్తున్న ఈ చిత్రం గురువారం (జూన్ 27)న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే రేపు ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్న మూవీ లవర్స్ ఓ సారి 'కల్కి' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ స్టోరీలో చదివేయండి మరి.

Kalki 2898 AD Interesting Facts
Kalki 2898 AD (ETV Bharat)

Kalki 2898 AD Interesting Facts : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో భారీ బడ్జెట్​తో రూపొందిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. సౌత్​తో పాటు నార్త్​లోని పలువురు భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే టీజర్​, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్​తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం గురువారం (జూన్ 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

  1. ప్రాజెక్ట్‌-కె అనే వర్కింగ్ టైటిల్​తో 2020 ఫిబ్రవరి 26న వైజయంతీ మూవీస్‌ బ్యానర్​ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అలా చూస్తే ఈ మూవీ పూర్తవడానికి సుమారు నాలుగేళ్ల కన్నా ఎక్కువ సమయమే పట్టినట్లు తెలుస్తోంది.
  2. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' రికార్డుకెక్కింది. దీని బడ్జెట్​ సుమారు రూ.600 కోట్లు దాటిందని ట్రేడ్​ వర్గాల అంచనా. యాక్టర్ల రెమ్యూనరేషన్​, సెట్స్‌కు అయిన ఖర్చుతో పోలిస్తే, నాణ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్​ను రూపొందించేందుకు చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేసిందట.
  3. ఈ మూవీకి కల్కి '2898 AD' అనే టైటిల్​​ పెట్టడం వెనుక ఓ పెద్ద లాజిక్‌ ఉంది. చిత్క ట్రైలర్​లో "6వేల సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు ఆ పవర్‌ వచ్చిందంటే" అని ఓ వ్యక్తి అంటారు. 2898 నుంచి 6000 సంవత్సరాలను మైనస్​ చేస్తే, 3102. కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం అది. అంటే 2898 ఏడీలో మళ్లీ శ్రీమహావిష్ణువు 'కల్కి'గా అవతరించరనున్నారని అర్థం. ఈ ఆరు వేల సంవత్సరాల్లో జరిగిన పరిమాణాలను కూడా టైమ్‌ ట్రావెల్‌ రూపంలో ఈ చిత్రంలో మేకర్స్ చూపించే అవకాశం ఉందని సమాచారం.
  4. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రం కోసం కొన్నాళ్లు వర్క్ చేశారు. ఆయనకున్న అనుభవం మేరకు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్​కు కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారట.
  5. ఈ సినిమా చిత్రీకరణ కోసం మూవీ టీమ్​ ఐమ్యాక్స్‌ డిజిటల్‌ కెమెరాను వినియోగించారు. యారి అలెక్స్‌ 65, యారి డీఎన్‌ఏ లెన్స్‌ను ఉపయోగించి 6.5K రిజల్యూషన్‌లో సినిమా రూపొందించడం వల్ల ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు అప్‌ స్కేలింగ్‌ సులువుగా మరింది. దీంతో పిక్చర్‌ క్వాలిటీ కూడా మరింత క్లియర్​గా ఉంటుంది. అయితే ఈ తరహా టెక్నాలజీ వాడి తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రం 'కల్కి' కావడం విశేషం.
  6. ఈ చిత్ర కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుందంటూ ఇటీవలే డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ స్వయంగా వెల్లడించారు. భవిష్యత్‌లో ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించారు. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండేలా ఓ కాంప్లెక్స్‌ను డిజైన్‌ చేశారు. సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబల అనే ప్రాంతాన్ని చూపించారు. వీటి అవుట్‌ లుక్‌ మొత్తం గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. ఇందుకోసం దాదాపు 700 వీఎఫ్‌ఎక్స్‌ షార్ట్స్‌ ఉపయోగించారట. ప్రైమ్‌ ఫోకస్‌, డీఎన్‌ఈజీ, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్‌ ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ మూవీకి పనిచేసినట్లు సమాచారం. 'హ్యారీ పోటర్‌', 'ఇంటర్‌స్టెల్లర్‌', 'డ్యూన్‌', 'బ్లేడ్‌ రన్నర్‌' వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టీమ్‌ 'కల్కి' కోసం పనిచేసింది.
  7. ఈ చిత్రంలో అశ్వత్థామగా బిగ్​బీ అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా లోకనాయకుడు కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించారు. 1985లో వచ్చిన 'గిరఫ్తార్'లో తొలిసారి ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
  8. ఈ మూవీ టీమ్​లో అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా 81 ఏళ్ల అమితాబ్​ ఉన్నారు. ఇందులో ఆయన పాత్ర మేకోవర్​ కోసం సుమారు 3గంటల సమయం పడితే, దాన్ని తీయడానికి 2గంటలు పట్టేదట. అంతేకాదు, యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం అమితాబ్‌ ఎంతో కష్టపడ్డారు. గతంలో ఈ షూటింగ్​లో ఆయన తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఇక 'మనం', 'సైరా నరసింహారెడ్డి' తర్వాత అమితాబ్‌ నటించిన తెలుగు చిత్రం ఇది.
  9. లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఈ చిత్రంలో సుప్రీం యాస్కిన్‌ అనే నెగిటివ్ షేడ్స్​ ఉన్న పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్‌ కోసం అనేక టెస్ట్‌లు చేశారు. చివరకు లాస్‌ ఏంజిల్స్ వెళ్లి, హాలీవుడ్‌ సినిమాలకు వర్క్​ చేసే మేకప్‌ ఎక్స్​పర్ట్​లను తీసుకొచ్చి ఈ పాత్రకు తగ్గ మేకప్​ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
  10. మలయాళ సీనియర్ నటి శోభన ఈ చిత్రంతో 18ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 2006లో వచ్చిన మంచు విష్ణు 'గేమ్‌'లో ఆమె చివరగా కనిపించారు. ఇందులో ఆమె సీనియర్ నటుడు మోహన్‌బాబు సతీమణిగా నటించారు.
  11. ఈ సినిమాలో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే కొందరు ముఖ్య నటులు అతిథి పాత్రలు రివీల్ అవ్వగా, మరికొందరూ కూడా కనిపించనున్నారట. నాని, దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, విజయ్‌ దేవరకొండలు ఇలా పలువురు పాపులర్ సెలబ్రిటీలు ఈ చిత్రంలో తళుక్కున మెరుస్తారట.
  12. ఈ సినిమాలో ప్రభాస్‌ వాడే బుజ్జీ వెహికల్‌ను మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్​ సహకారం అందించింది. ఇక ఈ ఒక్క కారు కోసమే మూవీ యూనిట్ రూ.4 కోట్లకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇందులోని ఏఐ బుజ్జి పాత్రకు కోలీవుడ్​ నటి కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు.
  13. పాన్‌ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాను వివిధ ఫార్మాట్‌లలో రిలీజయ్యేలా రూపొందించారు మేకర్స్​. 2D, 3D, IMAX, 4DX లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా 'కల్కి' కావడం విశేషం.
  14. ఇప్పటికే నార్త్‌ అమెరికాలో ఈ మూవీకి ఓ రేంజ్​లో క్రేజ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ సినిమా ప్రీ-సేల్స్‌లోనే అత్యంత వేగంగా 3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డుకెక్కింది.

షాకింగ్ - 'కల్కి 2898 AD' ఒక్కో టికెట్ ధర​ రూ.2300!

రూ.4 వేల రెమ్యునరేషన్​ నుంచి రూ.600 కోట్ల వరకు! - Kalki 2898 AD Director Nag Ashwin

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.