Kalki 2898 AD First Week Collections : 'కల్కి 2898 ఏడీ' కలెక్షన్ల దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు(జూన్ 27) నుంచే సంచలన వసూళ్లతో రికార్డు సృష్టించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మొత్తంగా రూ.725 కోట్ల వరకు సాధించింది.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఏకంగా రూ.191.5 కోట్లు రాగా వీకెండ్లో రూ.550 కోట్ల వరకు వచ్చాయి. అనంతరం ఐదో రోజు నుంచి వీక్ డేస్ ప్రారంభం కావడం వల్ల కాస్త లైట్‌గా కలెక్షన్లు తగ్గినా రికార్డులు మాత్రం క్రియేట్ అవుతున్నాయి. అలా ఏడు రోజుల్లో రూ.725 కోట్లను అందుకుంది.
ఈ క్రమంలోనే సలార్, బాహుబలి సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేసింది. సలార్ లాంగ్ రన్ టైమ్‌లో రూ.623 కోట్లు, బాహుబలి రూ. 632 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ కల్కి రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సంచలనం సృష్టించిన కల్కి 2898 ఏడీ మూవీ నుంచి రెండో భాగం కూడా రానుంది. ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే మిగితా చిత్రీకరణను కూడా పూర్తి చేసుకోనుంది. వచ్చే ఏడాది సెకెండ్ పార్ట్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నట్లు నిర్మాత అశ్వినీ దత్ కూడా చెప్పారు.
Kalki 2898 AD Amitabh Bachan Kamal hassan : సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా నటించగా అర్జునుడిగా విజయ్ దేవరకొండ, మరో పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టారు. బౌంటీ ఫైటర్ భైరవగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్ మూవీ చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. రెండో భాగంలో యాస్కిన్ పాత్రకు నడివి కూడా ఎక్కువగా ఉండనుందని మూవీటీమ్ చెబుతోంది. అందులో కమల్ నట విశ్వరూపం మరోసారి చూస్తారని అంటోంది.
రిస్క్ చేస్తున్న మీడియం రేంజ్ హీరోలు - ఎవరంటే? - Tollywood Tier 2 and 3 Heroes
ఆ దేశంలో రిలీజ్‌కు సిద్ధమైన మన హీరోల సినిమాలు - ఇంతకీ అవేంటంటే? - Indian Movie Releases In Japan