ETV Bharat / entertainment

తారక్​కు బాగా కోపమొచ్చిన సందర్భం- సీనియర్ ఎన్​టీఆరే అలా మార్చేశారట! - Jr NTR Birthday - JR NTR BIRTHDAY

Jr NTR Birthday Special: తన యాక్షన్​తో, ఎనర్జిటిక్ డ్యాన్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్​టీఆర్. సినీ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చినప్పటికీ తన ట్యాలెంట్​తో పలు హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. నేడు (మే 20) తారక్​ బర్త్​డే. ఈ సందర్భంగా ఈ స్టార్ హీరో గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.

Jr NTR Birthday Special
Jr NTR Birthday Special (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 6:19 AM IST

Jr NTR Birthday Special: ఆ ఫ్యామిలీ దాదాపు అందరూ సినీ స్టార్సే. టాలీవుడ్ సినిమాలకు ఓ కొత్త ఉనికి తెచ్చిన వాళ్లందరూ ఆ ఇంట్లో ఉన్నారు. అలా చిన్నప్పటి నుంచే సినీ వాతావరణంలో పెరిగిన ఓ కుర్రాడు, బాల నటుడిగా మెప్పించి, తొలి సినిమాతోనే సూపర్​హిట్​ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. డ్యాన్స్​, యాక్షన్ ఇలా అన్నింటిలోనూ టాప్​గా పేరొందాడు. యంగ్​ టైగర్​ నుంచి మ్యాన్​ ఆఫ్ మాసెస్​గా ఎదిగారు. ఇంతకీ ఆయనెవరో మీకు ఇప్పటికే తెలిసిపోయింది కదా. అవును ఆయనే మన జూనియర్ ఎన్​టీఆర్​. 'రామయణం'లో బుజ్జి రాముడిగా కనిపించి ప్రేక్షకులను మురిపించిన ఈ స్టార్, ఇప్పుడు 'దేవర'గా అభిమానులను పలకరించనున్నారు. నేడు(మే 20) జూనియర్ ఎన్​టీఆర్ బర్త్​డే. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

జూనియర్ ఎన్​టీఆర్ అసలు పేరు తారక్‌ రామ్‌. తన తాత సూచన మేరకు ఆయన నందమూరి తారక రామారావుగా మారారు. ఒకానొక సమయంలో సీనియర్‌ ఎన్​టీఆర్ తనను పిలవగా, ఆయన్ను కలిసేందుకు తారక్‌ వెళ్లారు. అప్పుడు ఆయన తారక్​ను 'నీ పేరేంటి?' అని అడగ్గా, తారక్‌ తన పేరు చెప్పారట. అది విన్న వెంటనే సీనియర్ ఎన్​టీర్, తారక్​ తండ్రి అయిన హరికృష్ణను పిలిచి ఇకపై 'నందమూరి తారక రామారావు' అని పిలవండి అంటూ సూచించారట. అలా తారక్ రామ్ కాస్త నందమూరి తారక రామారావుగా మారారు.

కెరీర్​ తొలినాళ్లలో తారక్ చాలా బొద్దుగా కనిపించేవారు. తొలి సినిమా అయిన 'నిన్ను చూడాలని', ఆ తర్వాతి 'స్టూడెంట్​ నెంబర్.1' ఇలా పలు సినిమాల్లో ఆయన అలానే కనిపించారు. బరువు తగ్గాలని అనుకున్నప్పటికీ ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన ఫిజిక్​పై పలు కామెంట్లు ఎదుర్కొన్నారు. 'హరికృష్ణకు నాన్నలా ఉన్నావ్‌' అంటూ ట్రోల్ కూడా చేశారు. దీంతో 'రాఖీ' సినిమాలోని తన లుక్‌ చూశాక 'సన్నగా అయ్యేందుకు ఎందుకు ప్రయత్నించలేకపోతున్నా' అంటూ తనపై తానే కోపగించుకున్నారట. అలా శ్రమించి 'యమదొంగ' సినిమాలో స్లిమ్ లుక్​లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు స్లిమ్​గానే కనిపిస్తున్నారు. మూవీలోని పాత్రకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటుంటారు. కొత్త లుక్స్​ను ప్రయత్నిస్తూ అభిమానుల్లో ఇన్​స్పిరేషన్ నింపుతున్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న 'దేవర'లోనూ తన లుక్స్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకుంటున్నారు.

జూనియర్ ఎన్​టీఆర్ ఎనర్జీ సీక్రెట్ - చిన్నప్పుడు అలా చేశారట! - Jr Ntr Energy Secret

టైగర్​ ఫైట్​​​ - కెమెరాకు కూడా చిక్కని ఎన్టీఆర్​​ పరుగు! - RRR Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.