ETV Bharat / entertainment

సినిమాలు నిల్, క్రేజ్ ఫుల్ - ఆ ఒక్కటి ఈ అందాల తారల జీవితాన్నే మార్చేసింది! - Heroines As SocialMedia Influencers

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 1:02 PM IST

Heroines As Social Media Influencers : ఓ దశలో సిల్వర్​ స్క్రీన్​పై టాప్ హీరోయిన్స్​గా రాణించి ఇప్పుడు డిజిటల్‌ స్టార్స్​గా మారిన పలువురు ముద్దుగుమ్మల గురించే ఈ కథనం. పూర్తి వివరాలు స్టోరీలో.

source Getty Images and ETV Bharat
shilpa shetty Neha dhupia Sameera reddy (source Getty Images and ETV Bharat)

Heroines as Social Media Influencers : సోషల్​​ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమలోని టాలెంట్​ను బయట పెట్టుకోవడానికి ఇదో మంచి సాధనం. ముఖ్యంగా సినీ తారలకైతే ఇదో సూపర్​ ప్లాట్​ఫామ్​. అయితే చాలా మంది హీరోయిన్లు కొంత కాలం రాణించిన తర్వాత ఛాన్స్​లు లేక, సక్సెస్​ రాక లేదంటే ఇతర పర్సనల్​ కారణాల వల్ల తెరపైన కనపడరు. మరి కొందరు ఓ దశలో స్టార్ హీరోయిన్లుగా వెలిగి ఆ తర్వాత వయసుపైబడి మాయమైపోతారు. అయితే వీరంతా వెండితెరకు దూరమైనా డిజిటల్​ ప్లాట్​ఫామ్​లో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. అలానే తమ ట్యాలెంట్​ను ఈ వేదికగా మరోసారి నిరూపించుకుంటున్నారు. కంటెంట్‌ క్రియేటర్స్‌గా, సోషల్‌ స్టార్స్‌గా రాణిస్తూ లక్షల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. లైఫ్‌స్టైల్‌, ఫ్యాషన్‌, బ్యూటీ లేదా పలు సామాజిక అంశాలపై కంటెంట్​ రూపొందిస్తూ తోటి మహిళల్లోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. అలా ఓ దశలో సిల్వర్​ స్క్రీన్​పై టాప్ స్టార్​గా రాణించి ఇప్పుడు డిజిటల్‌ స్టార్స్​గా మారిన పలువురు ముద్దుగుమ్మల గురించే ఈ కథనం.

శిల్పాశెట్టి(Shilpa Shetty Social Media) - వయసు పెరుగుతున్నా తరిగిపోని అందం, ఫిట్‌నెస్‌ ఈమెది. సినిమాలకు గుడ్‌ బై చెప్పిన తర్వాత ఈమె అందం, ఫిట్​నెస్ రహస్యాలను కంటెంట్‌గా క్రియేట్ చేసి తన ఫాలోవర్స్​కు అందించడం ప్రారంభించింది. వీటిపై మొదట ఓ డీవీడీని రిలీజ్​ చేసిన ఆమె ఆ తర్వాత పుస్తకాలు కూడా రాసింది. అనంతరం ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి దూసుకెళ్లింది. ఎన్నో ఆరోగ్యకరమైన వంటకాల్ని పోస్ట్ చేస్తుంటుంది. అలానే తాను వెళ్లే పర్యాటక ప్రదేశాల గురించి పోస్ట్ చేస్తుంది. ఫ్యాషన్‌ పాఠాలను నేర్పుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెకు 3.2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌ ఛానల్‌కు 36 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

సమీరా రెడ్డి(Sameera Reddy Social Media) - ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్​ ఇండస్ట్రీలో తనకెదురైన మంచి, చెడు అనుభవాల్ని పంచుకుంటుంటుంది. బాడీ షేమింగ్‌, బ్యూటీ షేమింగ్‌ వంటి వాటిపై కూడా అవగాహన కల్పిస్తోంది. పేరెంటింగ్‌ పాఠాలు చెబుతోంది. సరదా వీడియోలు కూడా చేస్తుంది. మహిళా ప్రాధాన్య సమస్యల పై కూడా మాట్లాడుతుంటుంది.

ఓ సందర్భంలో సోషల్ మీడియా గురించి సమీర్​ మాట్లాడుతూ తనకు ఈ ప్లాట్​ఫామ్​ ఉన్నతమైన హోదాను తెచ్చిపెట్టిందని చెప్పింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవకాశాలు, అందం విషయంలో ఎన్నో భయాలు తనకు ఉండేవని, కానీ ఆ భయాలను తాను అధిగమించినట్లు చెప్పుకొచ్చింది. ఈ పాజిటివిటీనే తోటి మహిళల్లో నింపడానికి, తాను సోషల్‌ మీడియాను ఎంచుకున్నట్లు తెలిపింది. అందుకే తాను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మారినట్లు చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాలో 17.8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

షెహ్​​నాజ్ ట్రెజరీ(Shenaz Treasury) - 'ఇష్క్‌ విష్క్‌', 'దిల్లీ బెల్లీ' వంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యుూటీ 'వన్‌ లైఫ్‌ టు లివ్‌' అనే అమెరికన్‌ టీవీ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది.

"నాకు ట్రావెలింగ్‌ చాలా ఇష్టం. అలా ఓ సారి బాలీ వెళ్లాక అక్కడి ప్రాంతాలను షూట్​ చేసి వీడియోను పోస్ట్ చేశాను. వ్యూస్ బాగా వచ్చాయి. దీంతో ట్రావెలింగ్‌ వీడియోలు చేయడం ప్రారంభించాను. అలా ఒక్క వీడియో నా లైఫ్​ను టర్న్ చేసింది." అని చెప్పుకొచ్చింది. అలా ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా క్రేజ్ సంపాదించుకుంది. ఈమెకు ఇన్‌స్టాలో 12 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

నేహా ధూపియా(Neha Dhupia Social Media)- 2002 మిస్‌ ఇండియా టైటిల్​, ఆ తర్వాత వరుస బాలీవుడ్‌ ఛాన్స్​లతో బిజీగా ఉన్న అందాల భామ నేహా ధూపియా అనంతరం సినీ ఛాన్స్​లు తగ్గిపోవడంతో కెరీర్​కు బ్రేక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌ షురూ చేయాలని భావించినా ఆమెకు అవకాశాలు దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో 2016లో నో ఫిల్టర్‌ విత్‌ నేహ అనే ఆడియో టాక్‌ షోను స్టార్ట్ చేసింది. సెలబ్రిటీలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ క్రేజ్ అందుకుంది.

దీని గురించి ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ "ఓ దశలో సినిమా ఛాన్స్​లు రాలేదు. దీంతో నాలో ఉన్న టాలెంట్​ను బయటపెట్టే అవకాశం సోషల్ మీడియా ఇచ్చింది." అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ టాక్‌ షో ఆరో సీజన్‌ నడుస్తోంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యలపై కూడా మాట్లాడుతుంటుంది. బ్రెస్ట్‌ఫీడింగ్‌, మహిళల హక్కులు, బాడీ పాజిటివిటీపై ఉన్న అనుమానాలు, అపోహలను క్లియర్ చేస్తూ, మానసిక ఆరోగ్యం వంటి వాటిపై కూడా కంటెంట్​ను అందిస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఇన్​స్టాలో 70 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ ముద్దుగుమ్మలతో పాటు సెలీనా జైట్లీ, తారా శర్మ వంటి వారు కూడా సోషల్ మీడియాలో పలు అంశాలపై కంటెంట్ క్రియేట్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

యూవీ బయోపిక్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​​ - హీరో ఎవరంటే? - Yuvaraj Singh Biopic

రామ్​చరణ్​తో మెల్​బోర్న్​ మేయర్​ సెల్ఫీ - 'నా కోరిక తీరిందంటూ' పోస్ట్​ - Melbourne Mayor Ramcharan Selfie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.