ETV Bharat / entertainment

ఆ అగ్ర నిర్మాతతో నా పెళ్లి! - హీరోయిన్ అంజలి - Heroine anjali Marriage - HEROINE ANJALI MARRIAGE

Heroine anjali Marriage : ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీ టాక్ షో ఆలీతో సరదాగా (Alitho Saradaga). అయితే ఈ వారం ఎపిసోడ్‌కు హీరోయిన్ అంజలి, నిర్మాత కోన వెంకట్‌ అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఇందులో భాగంగా తన పెళ్లి వార్తలపై అంజలి స్పందించారు.

ఆ అగ్రనిర్మాతతో నా పెళ్లి - హీరోయిన్ అంజలి

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 3:10 PM IST

Updated : Apr 3, 2024, 4:06 PM IST

Heroine anjali Marriage : నటి అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ సినిమా గీతాంజలి. ఈ చిత్రం అంజలి కెరీర్​ను మరో మెట్టు ఎక్కించింది. అయితే ఇప్పుడు సిక్వెల్​తో కూడా అదే మ్యాజిక్ రీపీట్ అవుతుందని ఈ సినిమా యూనిట్ నమ్ముతోంది. ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కాబోతున్న సందర్భంగా అంజలితో పాటు ఈ సినిమా నిర్మాత కోన వెంకట్ కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

తాజాగా ఈ ప్రమోషన్స్​లో భాగంగా ఈటీవీలో సూపర్ హిట్ టాక్​ షో అలీతో సరదాగాలో పాల్గొన్నారు అంజలి, కోన వెంకట్. ఇందులో తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ షోలో మొదటగా వచ్చిన అంజలికి ఒక బొకే ఇస్తూ 'ఇది అందుకే ఇస్తున్నాను' అని అలీ చెప్పగా అంజలి కూడా నవ్వుతూ తీసుకుంది. ఆ తర్వాత ప్రోమోలో అంజలి పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుతూ అలీ 'అతనితో పెళ్లి అంటగా' అని అడిగితే - 'ఒక అగ్ర నిర్మాతతో' అంటూ అంజలి నవ్వులు పూయించింది. దీని బట్టి ఆమె తన రూమర్స్ గురించే మాట్లాడినట్లు అర్థమైంది.

ఎందుకంటే గతంలో అంజలి ఓ బిజినెస్ మ్యాన్​ను పెళ్లి చేసుకుని ఫారెన్​లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ తెలుగు నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది. పెళ్లై విడాకులు తీసుకున్న నిర్మాతతో ఆమె ఏడడగులు వేయబోతున్నట్లు అన్నారు. దానిపైనే అంజలి స్పందించినట్లు అర్థమైంది.

ఇంకా స్పెషల్​ సాంగ్స్​ తాను ఎందుకు చేస్తున్నానో కూడా సమాధానం చెప్పింది అంజలి. స్క్రీన్ మీద వేసిన కొన్ని ఫోటోలను చూస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. గేమ్​ ఛేంజర్​ సినిమా విషయంలో తనకు నరాలు పట్టేసినట్లు గుర్తుచేసుకుంది. తాను అల్లరి బాగా చేస్తానని చెప్పుకొచ్చింది. సీతమ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాట పాడి అలరించింది.

ఇకపోతే గీతాంజలి సినిమాలో చేసిన శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, అలీ, బ్రహ్మాజీ సీక్వెల్​లోనూ నటించారు. అయితే గీతాంజలి మొదటి భాగంలో బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాలో కూడా ఉంటుందా లేదా అనేది ఈ సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది. ఈ చిత్రాన్ని MVV సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించగా, శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఇప్పటికే థియేటర్లలో డిజే టిల్లు చేస్తున్న సౌండ్​తో దద్దరిల్లుతున్నాయి ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చి ప్రేక్షకులను ఏమేరకు భయపెడుతుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆడియెన్స్ బీ అలర్ట్​ గీతాంజలి మళ్లీ వచ్చేసింది - ఈ సారి ముగ్గురు దెయ్యాలతో - Geethanjali Malli Vachindi Trailer

రూ.15 చీరలో షాకిచ్చిన అదా శర్మ - ఇప్పుడిదే ఫుల్ ట్రెండింగ్​! - Adah sharma 15rs Saree

Last Updated : Apr 3, 2024, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.