Happy Birthday Vijay Thalapathy Highest Grosser Films : దళపతి విజయ్ ఈ పేరు వినగానే తెలుగువాళ్లకు గుర్తొచ్చే సినిమా స్నేహితుడు. ఆ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్ అప్పటికే తమిళంలో స్టార్ హీరో. ఆ తర్వాత కత్తి, తుపాకీ, మెర్సల్ వంటి చిత్రాలతో మరింత దగ్గరయ్యారు. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
2.బిగిల్(2019): ఫూట్ బాల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.321 కోట్లు కలెక్షన్ సాధించింది. విజయ్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఫూట్ బాల్ కోచ్‌గా విజయ్ నటనకు మార్కులు బాగానే పడ్డాయి.
3.మెర్సల్(2017): వైద్య రంగానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ మూవీలో కూడా విజయ్ డ్యూయెల్ రోల్లో కనిపించారు. ఈ చిత్రం దాదాపు రూ.267 కోట్లు సాధించి ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిల్చింది.
4.సర్కార్(2018): విజయ్, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు కలెక్షన్ సాధించింది. ఫుల్ రన్‌టైమ్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రానికి రూ.250కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
5.మాస్టర్(2021): ఈ మూవీలో కాలేజ్ లెక్చరర్‌గా విజయ్ ఆడియెన్స్‌కు తెగ నచ్చేశారు. విజయ్ సేతుపతి నెగటివ్ రోల్లో కనిపించిన ఈ సినిమా మొత్తం రూ. 230కోట్ల వసూళ్లు సాధించింది.
6.తేరి(2016): అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ అదరగొట్టారు. ఈ చిత్రంలో మరో హైలైట్ ఒకప్పటి హీరోయిన్ మీనా కూతురు నైనీక నటించడం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.168 కోట్లు కలెక్షన్ సాధించింది.
7.తుపాకి(2012): విజయ్ ఒక ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించిన ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.168 కోట్లు సాధించి సూపర్ హిట్ అయింది.
8.కత్తి(2014): ఒక ఊరికి జరుగుతున్న అన్యాయన్ని ఎలా ఎదుర్కున్నారు అనే కథాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో కూడా డ్యూయెల్ రోల్లో కనిపించిన విజయ్‌కు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.138 కోట్లు కలెక్షన్ సాధించి మంచి పేరు తెచ్చిపెట్టింది.
9.భైరవ(2017): థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు మిక్సడ్ రివ్యూస్ వచ్చినా అవి ఈ సినిమా వసూళ్లు పైన ప్రభావం చూపించలేదు. ఈ చిత్రం దాదాపు రూ.115 కోట్లు కలెక్షన్ సాధించింది.
10.స్నేహితుడు(2012): తెలుగులో స్నేహితుడుగా విడుదలైన ఈ చిత్రం హిందీలో వచ్చిన త్రీ ఇడియట్స్ మూవీకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.86 కోట్లు సాధించి రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువలో వచ్చి ఆగిపోయింది.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ తన రాజకీయ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటివరకు సైన్ చేసిన చిత్రాలను పూర్తిచేసే పనిలో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఇది రిలీజ్ కానుంది.
దళపతి విజయ్‌కు స్టార్డమ్ తెచ్చిపెట్టిన తెలుగు రీమేక్ సినిమాలివే! - VijayThalapathy Telugu Remake