Happy Birthday Anushka Sharma : తన అందం అభినయంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అనుష్క శర్మ. నిర్మాతగానూ వ్యవహరిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. వాస్తవానికి ఆర్మీ కుటుంబ నేపథ్యంలో జన్మించిన అనుష్కకు మొదట్లో నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. కానీ అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
మొదట మోడలింగ్‌ను కెరీర్‌గా ప్రారంభించుకున్న అనుష్క శర్మ 2008లో రబ్ నే బనా ది జోడి సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే షారుక్ లాంటి పెద్ద స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో ఒక మూవీ చేసినా మంచి ఫలితం ఇవ్వలేదు. రణ్ వీర్‌తో చేసిన బ్యాండ్ బాజా బరాత్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనుష్కను హీరోయిన్‌గా నిలబెట్టింది. అనంతరం కెరీర్లో అమీర్ ఖాన్(పీకే), సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోలతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది.
హీరోయిన్‌గా గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు పరి లాంటి డీగ్లామర్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. అనుష్క కెరీర్లో సూపర్ హిట్స్ మాత్రమే కాదు డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ లాంటి స్టార్స్్తో తెరకెక్కిన బాంబే వెల్వెట్ కనీసం రూ.50 కోట్ల కలెక్షన్ కూడా సాధించలేకపోయింది. అనుష్క చివరగా నటించిన షారుక్ మూవీ జీరో కూడా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ పెట్టిన పెట్టుబడిని కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది. అలా 2018లో వచ్చిన జీరో చిత్రం తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్కు దూరమైంది.
కోహ్లీతో పెళ్లి - ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం వామిక, ఆకాయ్కు జన్మనిచ్చింది. తల్లైనా కూడా ఆమె అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. సోషల్ మీడియాలో ఈమెకు 67.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి టాప్ హీరోల ఫాలోయింగ్ కన్నా అనుష్కకే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.
ఇకపోతే అనుష్క ఇండియన్ క్రికెటర్ జులాన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా రూపొందిన చక్దా ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించింది. ఇది చాలా కాలం నుంచి విడుదలకు నోచుకోలేదు. త్వరలోనే ఇది రిలీజ్ కావొచ్చు. దీనికి ప్రాసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రేణుక సహనే, అన్షుల్ చౌహన్, కౌశిక్ సేన్, మహేష్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
యాక్షన్ మోడ్‌లో అందాల భామలు - తుపాకీతో బాక్సాఫీస్‌కు గురి పెట్టి! - Tollywood Heroine Action Movies
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సంచలనానికి 50 ఏళ్లు - తెర వెనక విశేషాలివే! - Alluri Sitaramaraju