ETV Bharat / entertainment

హనుమాన్​ : ఒక్క రుధిరమణి కోసం వంద మణులు - అంజనాద్రి ఆర్ట్​ వర్క్​ విశేషాలివీ! - హనుమాన్ రుధిరమని

Hanuman Movie : 'హనుమాన్' మూవీ ఆర్ట్ వర్క్​ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా తెలిపారు ఆర్ట్ డెర్కటర్​ టి.నాగేంద్ర. ఆ విశేషాలివీ.

హనుమాన్​ : ఒక్క రుధిరమణి కోసం వంద మణులు - అంజనాద్రి ఆర్ట్​ వర్క్​ విశేషాలివీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 6:41 AM IST

Hanuman Movie : ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజై భారీ హిట్ అందుకున్న చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్‌ హీరో చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించారు. దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం. అయితే ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో టి.నాగేంద్ర ఆర్ట్‌ వర్క్‌ కూడా ఒకటి. 'కల్కి', 'జాంబిరెడ్డి', 'విరూపాక్ష' లాంటి సక్సెస్​ఫుల్​ సినిమాలకు కళా దర్శకుడిగా పని చేశారాయన. ఈయనే అంజనాద్రి అనే ఓ ఊహా ప్రపంచాన్ని నిర్మించి అందర్నీ ఆకట్టుకున్నారు. అలాగే సినిమా మొత్తం హనుమంతు రుధిరమణి చుట్టూనే తిరుగుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగేంద్ర ఆ రుధిరమణితో పాటు హనుమాన్ ఆర్ట్ వర్క్​ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.

పంచభూతాల మధ్య అందమైన ఊరిలా : "డైరెక్టర్​ ప్రశాంత్‌ ఈ కథ చెప్పినప్పుడే అంజనాద్రి కోసం తప్పకుండా ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని అనుకున్నాం. ఫాంటసీకి, రియాలిటీకి దగ్గరగా ఉండాలేలా సహజంగా తీర్చిదిద్దాలని భావించాం. చుట్టూ పచ్చటి వాతావరణం, ఎత్తైన కొండలు, మరోవైపు నది ఇలా పంచభూతాల మధ్య అందమైన ఊరిలా నిర్మించాలని ఫిక్స్ అయ్యాం. ఇందుకోసం హైదరాబాద్​కు దగ్గర్లోని వట్టినాగులపల్లిలోని ఓ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని అక్కడే అంజనాద్రిని సెట్‌ల రూపంలో డిజైన్ చేశాం. దీనికి కోసం దాదాపు 150నుంచి 200రోజులు సమయం పట్టింది. ఈ చిత్రంలో కనిపించే అంజనాద్రి ఊరు, హనుమంతు - గెటప్‌ శీను ఇళ్లు, కుస్తీ జరిగే కోర్టు, విలన్​ వినయ్‌ రాయ్‌ క్యారవాన్‌, అలాగే ఆయన ఇంట్రో ఎపిసోడ్‌లో వచ్చే బ్యాంకు ఫైట్ సీక్వెన్స్​ అన్నీ సెట్లే. అయితే నాకు సవాల్‌గా అనిపించింది మాత్రం హనుమంతుల వారి రక్త బిందువుతో ఏర్పడ్డ రుధిరమణిని డిజైన్ చేయడమే. దీన్ని సహజంగా, ప్రతిఒక్కరూ నమ్మగలిగేలా రూపొందించాలని రకరకాల ఆకారాల్లో దాదాపు వందకు పైగా మణుల్ని తయారు చేశాం. చివరికి హనుమంతుల వారి రక్త బిందువుని రాముడి నామంలా పెట్టి, దాని చుట్టూ ఓ శక్తిమంత మైన రక్షణ కవచం ఏర్పడ్డట్లుగా తీర్చిదిద్దాం. అది బాగా వర్కవుట్‌ అయింది. నిజానికి ఈ మణిని తయారు చేసేసరికి సినిమా 50 శాతం షూటింగ్ కూడా జరుపుకుంది." అని ఆయన అన్నారు.

మహర్షి సెట్​లో చేశాం : "ఇక వినయ్‌ రాయ్‌ ఇంట్రో సీన్ బ్యాంకు దోపిడీ సీన్స్​ను కొల్లూరు దగ్గరున్న ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్స్​ దగ్గర చిత్రీకరించాం. చిత్ర క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలోని మహర్షి సెట్‌లో షూట్ చేశాం. ఆ ఫైట్‌ సీక్వెన్స్ షూట్​ చేస్తున్నప్పుడు పొగ కమ్ముకునే సీన్​ కోసం చాలా కష్టపడ్డాం. తిరుమల ఏడు కొండల స్ఫూర్తితో అంజనాద్రిలో కనిపించే పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని గ్రాఫిక్స్​ ద్వారా డిజైన్ చేశాం" అని నాగేంద్ర పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5 ఏళ్లుగా సినిమాలకు దూరం, అయినా వందల కోట్ల ఆదాయం - ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?

'ఓజీ' మేకర్స్​ బిగ్ ప్లాన్​ - పవన్ మూవీకి పవర్​ఫుల్​ టైటిల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.