Guntur Kaaram Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. రీసెంట్గా సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంలో అందంగా కనిపిస్తూ, చక్కటి అభినయం కనబర్చింది. అయితే ఆమెకు అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్ర ఇవ్వడం వల్ల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై అభిమానులు, ప్రేక్షకులు కాస్త విమర్శించారు. అయితే మీనాక్షి చౌదరి సినిమాల్లోకిి రాక ముందు ఏం చేసేదో తెలుసా?
వివరాల్లోకి వెళితే. సాధారణంగా ప్రేక్షకులకు తెలిసినంత వరకు మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియాగానూ ఎంపికైంది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి ఆకట్టుకుంది. అనంతరం యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ 2 చిత్రంతో తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో మీనాక్షి చౌదరికి మంచి పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆమె అందానికి అందరూ బాగా ఫిదా అయిపోయారు.
ఈ సినిమా తర్వాత మీనాక్షికి మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా గుంటూరు కారం మహేశ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. దీంతో ఆమె పేరు మరింత పాపులర్ అయింది. కానీ సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ స్కోప్ లేకుండటం వల్ల ఫ్యాన్స్ కాస్త ఫీలయ్యారు. దీని తర్వాత మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసింది. అందులో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమా అని కూడా అన్నారు.
అయితే ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడింది. తాను ఒక సర్టిఫైడ్ డెంటిస్ట్ అని చెప్పింది. నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ కోర్స్‌ను పూర్తి చేసినట్లు చెప్పింది. అంతే కాదు స్టేట్ లెవెల్లో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్లోనూ ఛాంపియన్‌గా నిలిచినట్లు చెప్పుకొచ్చింది. అలానే స్టేట్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రాణించినట్లుగా కూడా చెప్పింది.
OTTలో భయపెట్టేందుకు మరో తెలుగు హారర్ మూవీ రెడీ - చూసే సాహసం చేయగలరా?
9 రోజుల క్రితం మిస్సింగ్ - నది ఒడ్డున శవమై తేలిన ప్రముఖ దర్శకుడు