ETV Bharat / entertainment

ఇదేందయ్యా ఇది - శ్మశాన వాటికలో మూవీ టీజర్​ రిలీజ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 12:14 PM IST

Updated : Feb 22, 2024, 12:57 PM IST

Geethanjali Malli Vachindi Teaser : గీతాంజలి - మళ్లీ వచ్చింది మేకర్స్ ఓ బిగ్ అండ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. శ్మశాన వాటికలో తమ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

Etv Bharat
Etv Bharat

Geethanjali Malli Vachindi Teaser : తెలుగమ్మాయి అంజలి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్​గా పరిచయం అయ్యింది. తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఈమె తెలుగులో మొదటగా 2006లో ఫోటో అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది అంజలీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా చిత్రాలతో ఆమె పాపులారిటీ పెరిగింది. దీని తర్వాత 2014లో విడుదలైన కామెడీ హార్ర‌ర్ థ్రిల్లర్ సూపర్ హిట్ చిత్రం​ గీతాంజలీతో మంచి సక్సెస్​ను ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఆమె టైటిల్ రోల్‌ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి - మళ్లీ వచ్చింది. గీతాంజలి చిత్రానికి ఇది సీక్వెల్​గా​ రాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అండ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో తమ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇది తెలుసుకుంటున్న నెటిజన్లు స్మశాన వాటికలో టీజ‌ర్ లాంచ్ ఏంటి భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా స్మశాన వాటికలో టీజర్ లాంఛ్ చేయడం ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇదే తొలిసారి అని అంటున్నారు. అలాగే ఈ టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా ఇది రూపొందుతోంది. కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లే అందిస్తున్నారు. శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కొత్త సంవ‌త్సరం కానుక‌గా విడుదల చేసిన అంజ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన హింట్ - ఆనందంలో మెగా ఫ్యాన్స్!

ఫుట్​పాత్​ లైఫ్ నుంచి స్టార్ డైరెక్టర్​గా - తేజ​ పరిచయం చేసిన అందాల భామలు వీరే!

Last Updated : Feb 22, 2024, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.