Gangs Of Godavari Movie Review : మాస్ కా దాస్ విష్వక్ సేన్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' శుక్రవారం థియేటర్లలో సందడి చేసింది. విష్వక్ కూడా ఈ సినిమాలో మునుపెన్నడు లేని లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. నేహా శెట్టి, అంజలి కూడా తమ పాత్రలతో మెప్పించారు. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ మూవీని చూడకుండానే పలువురు రివ్యూలు ఇచ్చారంటూ విష్వక్ పేర్కొన్నారు. మ్యూజిక్ బాలేదు అంటూ ఆ రివ్యూల్లో ఉందంటూ హీరో తెలిపారు. సినిమాకు ప్రధాన బలమైనదాన్నే వారు బాలేదన్నారంటే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైంది అంటూ విష్వక్ పేర్కొన్నారు. సినిమాను చూసి అందులోని వీక్ పాయింట్స్‌ను వెలికితీసి రివ్యూస్ రాయడంలో తప్పులేదని అన్నారు. మూవీ విడుదలైన తర్వాత జరిగిన ఓ ప్రెస్ మీట్లో విష్వక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా రిలీజైన వారానికే రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై తాజాగా టాలీవుడ్‌లో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విష్వక్ ఇలా స్పందించారు. వారం సంగతేమోగానీ సినిమా చూడకుండానే ఉదయం 6 గంటలకే కొందరు రివ్యూలు రాశారంటూ పేర్కొన్నారు. టికెట్ కొన్న వారికే 'బుక్ మై షో'లో రేటింగ్ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' స్టోరీ ఏంటంటే?
ఎదగడం మన హక్కు అంటూ నమ్మిన ఓ కుర్రాడు లంకల రత్నాకర్ (విష్వక్ సేన్). తన తండ్రి చెప్పిన ఈ మాటను చిన్నప్పటి నుంచే బాగా ఒంటబట్టించుకుంటాడు. అందుకే తనలోని మనిషిని పక్కనపెట్టి, ఎదుటివాళ్లని వాడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. అయితే చిన్నపాటి చోరీలకు పాల్పడే రత్నాకర్, అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ)కి కుడిభుజంగా మారతాడు. అంతే కాకుండా దొరసామి, నానాజీల మధ్య నడుస్తున్న రాజకీయ వైరంలోకీ తలదూర్చుతాడు. ఇక ఆ రాజకీయం అతన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లింది? అతను కోరుకున్నట్టు ఎదిగాడా, లేదా? లంకల్లోని పగ అతన్ని ఎలా వెంటాడింది? బుజ్జి(నేహాశెట్టి), రత్నమాల (అంజలి)లతో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఇటువంటి విషయాలు తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.
విశ్వక్ సేన్ నిర్ణయం- ఐదు సినిమాలకు ఇబ్బంది! - Vishwak Sen Gangs Of Godavari