ETV Bharat / entertainment

'అతడి స్టంట్స్, యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ '- రామ్​చరణ్​పై ఫ్రెంచ్ హీరో ప్రశంసలు - Lucas Bravo On Ram Charan - LUCAS BRAVO ON RAM CHARAN

Lucas Bravo About Ram Charan: పాన్ఇండియా స్టార్ రామ్​చరణ్​పై ఫ్రెంచ్ నటుడు లుకస్ బ్రావో ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్​లో చెర్రీ నటన బాగుందంటూ మెచ్చుకున్నారు.

Ram Charan RRR
Ram Charan RRR (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 8:49 AM IST

Lucas Bravo About Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​ నటనపై ఫ్రెంచ్ నటుడు లుకస్ బ్రావో ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్​చరణ్ పాత్ర అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. తాజాగా ఆన్​లైన్ ద్వారా ఓ​ ఇంటర్వ్యూలో పాల్గొన్న లుకస్ బ్రావో చెర్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో 'మీరు ఇష్టపడే ఇండియన్ మూవీ లేదా ఇండియన్ నటుడు ఎవరు' యాంకర్ అని అడిగారు.

దీనికి లూకాస్ బ్రావో సమాధానంగా రామ్​చరణ్ పేరు చెప్పుకొచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో మెయిన్‌ హీరో రామ్‌చరణ్‌ నటన అద్భుతం. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నారు' అని బ్రావో అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్​లోకి వచ్చింది. మరోవైపు ఈవీడియోను రామ్​చరణ్ ఫ్యాన్స్​ షేర్ చేస్తున్నారు.

కాగా, 2022లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీ వరల్డ్​వైడ్​గా రూ.1000కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అనేక రికార్డులు బ్రేక్ చేసింది. అంతర్జాతీయ వేదికల్లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. సినిమాలోని 'నాటు నాటు' పాటకుగాను 2023 ఆస్కార్ అవార్డ్ దక్కింది.

Ram Charan Game Changer: కాగా, రామ్‌ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్‌' సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రామ్​చరణ్ డ్యయెల్ రోల్​లో కనిపించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ బ్యాటీ కియారా అడ్వాణీ హీరోయిన్‌ పాత్రలో కనిపించనుంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ నటి అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల​ ఈ సినిమా నుంచి జరగండి, జరగండి పాట రిలీజైంది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 2024 డిసెంబర్ లేదా 2025 సంక్రాతికి సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్ - నితిన్ సినిమా పోస్ట్​పోన్!

'గేమ్​ఛేంజర్' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్​రాజు!- మెగాఫ్యాన్స్ గెట్​రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.