First Indian Cinema Insured : బాక్సాఫీస్ వద్ద వచ్చిన అన్ని సినిమాలు హిట్ అవ్వాలని గ్యారెంటీ లేదు. కొన్ని సార్లు భారీ బడ్జెట్‌తో కొండంత ఆశలు పెట్టుకుని మరీ రూపొందించిన సినిమాలు థియేటర్లలో నిరాశపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో పలు మార్లు ఆ చిత్ర నిర్మాతలు కూడా తీవ్రంగా నష్టపోతుంటారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం ముందు చూపుగా సినిమాలకు ఇన్సూరెన్స్ చేయిస్తుంటారు. ఈ ప్రాక్టీస్‌ను ఇప్పటికీ ఎంతో మంది ఫాలో అవుతున్నారు కూడా. అయితే ఇండియాలో ఈ ట్రెండ్‌ను మొట్టమొదటిసారి అమలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా ?
1999లో విడుదలైన 'తాల్' మూవీ ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పిందీ సినిమా. అక్షయ్ ఖన్నా, అనిల్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన మ్యూజికల్ డ్రామా ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో సక్సెస్ సాధించింది. రూ.11 కోట్ల బడ్జెట్ గల ఈ చిత్రం దాదాపు రూ.22 కోట్ల కలెక్షన్ అందుకుంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది. అయితే 1999లో సుభాష్ ఘాయ్ ఈ సినిమాకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్క్ సంస్థలో బీమా చేయించారు. అలా ఈ సినిమా మొట్టమొదటిగా బీమా అయిన సినిమాగా రికార్డుకెక్కింది.
2000వ సంవత్సరంలో 'తాల్' సినిమాకు ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. నటుడు అనిల్ కపూర్‌కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహామన్కు బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‌గా, ఆనంద్ బక్షికి బెస్ట్ లిరికిస్ట్‌గా, అల్కా యాగ్నిక్‌కు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా, రాకేశ్ రంజన్‌కు బెస్ట్ సౌండ్ డిజైనర్‌గా, కబీర్ లాల్‌కు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఇలా ఆరు విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. దీంతో ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రూ.190కోట్ల బడ్జెట్ - కలెక్షన్స్ రూ.15 కోట్లే! - Biggest Disaster movie