First Indian actor to charge Rs 100 crore : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రూ.వెయ్యి కోట్ల బాక్సాఫీసు కలెక్షన్ అనే రికార్డు ప్రస్తుతం కామన్ అయిపోయింది. కానీ, ఒకప్పుడు మాత్రం ఓ సినిమా వంద కోట్లు వసూలు చేయడం అనేది చాలా గొప్ప విషయయే అని అనేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న సెలబ్రిటీలు కూడా కోట్లలో ఒకరనే చెప్పాలి.
ఇప్పుడు ఇండియన్ సినిమా రేంజ్ భారీగా పెరిగింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ దక్కించుకుని వంద కోట్లు దాటి వెయ్యి కోట్ల వరకూ వసూళ్లు సాధిస్తున్న హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. రీసెంట్గా దళపతి విజయ్ 'గోట్' సినిమాకు సుమారు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుని చరిత్ర సృష్టించారు. అయితే ఈ వంద కోట్ల రెమ్యునరేషన్ క్లబ్‌ను ఓపెన్ చేసిన ఇండియన్ హీరో ఎవరో తెలుసా? ఆయనెవరోకాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్.
2016కు ముందు సల్మాన్ ఖాన్ తీసిన సినిమాలన్నీ వరుసగా సూపర్ హిట్స్ అవ్వడం వల్ల ఈ కండలవీరుడికి ఇండస్ట్రీలో ఓ రేంజ్లో క్రేజ్ పెరిగింది. దీంతో ఆయన తీసుకునే పారితోషికం కూడా అమాంతంగా పెరిగింది. వాస్తవానికి 90స్లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి స్టార్స్ బాక్సాఫీస్ స్టార్స్‌గా నిలుస్తున్న సమయంలో సల్లు భాయ్ కూడా వీరి సరసన చేరి వారిద్దరికీ గట్టిపోటినిచ్చాడు. 2009లో 'పోకిరి' రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన 'వాంటెడ్' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయగా, ఆ తర్వాత వచ్చిన 'దబాంగ్'తో సల్మాన్ టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. 2016 వచ్చేసరికి ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నిలిచారు. రెజ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిన 'సుల్తాన్' సినిమాకు సల్మాన్ అక్షరాల రూ. వంద కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారని సినీ వర్గాల మాట. ఓ ఇండియన్ హీరో ఇలా వంద కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవడం అదే తొలిసారి.
ఇక సల్మాన్ నటించిన 'సుల్తాన్','టైగర్ జిందా హై' సినిమాలతో పాటు సల్మాన్ 2016-17లో నటించిన మొత్తం సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇవన్నీ అప్పట్లోనే బాక్సాఫీసు వద్ద ఒక్కొక్కటి వంద కోట్ల వరకు మేర వసూలు చేశాయట.
ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్‌తో పాటు అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల లిస్ట్‌లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, ప్రభాస్, అజిత్ కుమార్ ఉన్నారు.
స్టార్ హీరో లైనప్‌లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్‌తో! - Big Budget Upcoming Movies