ETV Bharat / entertainment

ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన 'జాతి రత్నాలు' ఫరియా అబ్దుల్లా! - Faria Abdullah Marriage

Faria Abdullah Marriage : హైదరాబాద్ బ్యూటీ జాతి రత్నాలు ఫేమ్​ ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ఆ వివరాలు.

ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన 'జాతి రత్నాలు' ఫరియా అబ్దుల్లా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 5:17 PM IST

Updated : Mar 14, 2024, 6:42 PM IST

Faria Abdullah Marriage : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీల పెళ్లిల్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. రీసెంట్​గానే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ కూడా పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఆమెనే హైదరాబాద్ బ్యూటీ, జాతి రత్నాలు ఫేమ్​ ఫరియా అబ్దుల్లా. ఈ ముద్దుగుమ్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. జాతిరత్నాలు చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ చిట్టి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈమె మాత్రం నటిగా మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలానే ఈ ఆరడుగులుండే ఫరియా డాన్స్​కు చాలా మంది ఫిదా అవుతూ ఉంటారు. తను బెల్లీ డాన్స్ వేస్తే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. సోషల్ మీడియాలోనూ కాస్త లైట్ ఎక్స్​పోజింగ్ చేస్తూ బాగానే ఫొటోషూట్స్ చేస్తుంటుంది.

అయితే తాజాగా ఈమె పెళ్లి వార్త బయటకు వచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడిని ఈమె పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే అతడికి కూడా సినీ పరిశ్రమ మీద మంచి ఆసక్తి ఉందట. అందుకే అతడు షార్ట్​ ఫిల్మిమ్స్​లో హీరోగా నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం బాగా ట్రెండ్ అవుతోంది.

Allari Naresh Faria Abdullah Movie : ఇకపోతే ఫరియా అబ్దుల్లా హీరో అల్లరి నరేశ్‌తో కలిసి ఆ ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాట - ఇప్పటికీ పాటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్​!

దటీజ్​ రాజమౌళి - ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్‌ అయిన జక్కన్న సినిమా తెలుసా?

Last Updated : Mar 14, 2024, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.