Family Star Release Date: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా 2024 సంక్రాంతికే రావాల్సి ఉండగా, షూటింగ్ పనులు ఆలస్యం అవ్వడం వల్ల పోటీ నుంచి తప్పుకుంది. ఇక ఈ మూవీ 2024 సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్‌రాజు ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పారు. అయితే దేవర సినిమా పోస్ట్‌పోన్ అయినట్లైతే ఫ్యామిలీ స్టార్ ఆ డేట్‌ను లాక్ చేసుకుంటుందని కూడా ఓ సందర్భంలో ఆయన అన్నారు. ఇక తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల దేవర వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
'గీతా గోవిందం' తర్వాత విజయ్- పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషనన్స్ పెంచుకుంటున్నారు. 2018లో వచ్చిన ఈ సినిమా అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియోన్స్‌ను ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో 'గీత గోవిందం' కూడా ఒకటి. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ 'ఫ్యామిలీ మ్యాన్ కోసం' జత కట్టారు.
-
A blockbuster entertainment bonanza is on its way! 💥💥
— Sri Venkateswara Creations (@SVC_official) February 2, 2024
𝐀𝐩𝐫𝐢𝐥 𝟓𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒 is your date to welcome our #FamilyStar into your hearts ♥️#FamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/7O69QIFQcn
మరి 'దేవర' సంగతేంటి? అయితే ఏప్రిల్ 5ను మొదట 'దేవర' టీమ్ లాక్ చేసుకుంది. ఈ విషయాన్ని మూవీయూనిట్ ఇదివరకే తెలిపింది. అయితే ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రీసెంట్గా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ కాస్త అలస్యమయ్యేలా ఉందట. దీంతో 'దేవర' రిలీజ్ దాదాపు వాయిదా పడుతుందని ఇన్సైడ్ టాక్. అందుకే ఫ్యామిలీ స్టార్ మేకర్స్ రిలీజ్ అనౌన్స్ చేశారేమో!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంక్రాంతి రేసు నుంచి 'ఫ్యామిలీ స్టార్' ఔట్ - అదే కారణమా?
టైమ్స్ స్క్వేర్‌పై 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్ - న్యూయార్క్‌లో ఫ్యాన్స్‌తో సందడి చేసిన రౌడీ హీరో