ETV Bharat / entertainment

'ఈగల్' ఫుల్ ఆఫ్ యాక్షన్ గ్లింప్స్​ ఔట్- రిలీజ్​కు ముందు బూస్ట్! - Eagle Movie New Glimpse

Eagle Movie New Glimpse: ​రవితేజ లేటెస్ట్​ మూవీ 'ఈగల్' ఫిబ్రవరి 09న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అయితే రీలీజ్​కు ముందు మేకర్స్ మరో యాక్షన్ గ్లింప్స్​ను వదిలారు. మరి మీరు ఆ గ్లింప్స్​ వీడియో చూశారా?

Eagle Movie Solo Release
Eagle Movie Solo Release
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 5:30 PM IST

Eagle Movie New Glimpse: మాస్ మహారాజా రవితేజ లీడ్​ రోల్​లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్​కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 7) మూవీ మేకర్స్​ సినిమా నుంచి మరో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. 'పద్దతైన దాడి' పేరుతో రిలీజైన వీడియో మొత్తం వైలైంట్​గా ఉంది. దీంతో సినిమా కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్​తో ఉండనున్నట్లు తెలుస్తోంది.

సోలో రిలీజ్: ఇక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2024 సంక్రాంతికే రిలీజ్ అయ్యేది. కానీ, థియేటర్ల అడ్జెస్ట్​మెంట్​ కారణాల వల్ల ఈగల్ సంక్రాంతి బరిలోనుంచి తప్పుకుంది. తెలుగు ఫిల్మ్​ ఛాంబర్ ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాకు సోలో రిలీజ్డేట్ ఇచ్చారు. కానీ, ఈ సినిమాతోపాటుగా పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. అయితే అవి ఈగల్​పై పెద్దగా ప్రభావం చూపవని అంటున్నారు. దీంతో రవితేజ సినిమా సోలోగా వస్తున్నట్టే చెప్పాలి. ఈ చిత్రానికి వీలైనన్ని థియేటర్లు కూడా దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో రవితేజ 'ధమాకా' తర్వాత ఈ రేంజ్​ వసూళ్లు సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రవితేజ ఫస్ట్ రివ్యూ
Eagle Movie First Review: ఈ సినిమాను రవితేజ రీసెంట్​గా చిత్ర బృందంతో కలిసి స్పెషల్​ స్క్రీనింగ్​లో వీక్షించారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ సోషల్​ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాపై రవితేజ సూపర్ కాన్ఫిడెంట్​గా ఉన్నారు. 'ఈగల్' సినిమా చూసిన తర్వాత 'నేను చాలా సంతృప్తిగా ఉన్నాను' అంటూ ఒక్క మాటలో రవితేజ చెప్పారు. ఇలా తన మాటాల్లో సినిమా మీద రవితేజ ఫస్ట్ రివ్యూను ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్ఫాన్స్​ వస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

Eagle Movie Cast: 'ఈగల్‌' సినిమా విషయానికొస్తే- రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటించారు. నటుడు నవదీప్‌, మధుబాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో డైలాగ్స్​ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. 'విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను','విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను', 'మార్గశిరం మధ్య రాత్రి మొండి మోతుబరి మారణ హోమం', 'తుపాకీ నుంచి బుల్లెట్ ఆగేది, అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు', 'ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు' ఇలాంటి డైలాగ్స్​తో ట్రైలర్​ను మరింత ఇంట్రెస్టింగ్​గా మార్చారు.

రజనీకాంత్​ 'లాల్​ సలామ్'కు బిగ్ షాక్​​ - తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఇదే!

తాతకు తగ్గ మనవడే - ఎన్టీఆర్ డ్రీమ్​ రోల్ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.