ETV Bharat / entertainment

DJ Tillu బోల్డ్​ రోల్​ - స్టేజ్​పైనే అనుపమ స్ట్రాంగ్ ఆన్సర్​ - DJ Tillu Heroine Anupama

DJ Tillu Heroine Anupama Parameshwaran Bold Role : టిల్లు స్కేర్ మూవీలో అనుపమ పరమేశ్వర్ బోల్డ్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. తాను నటించిన గత చిత్రాల కన్నా భిన్నంగా ఈ మూవీలో గ్లామర్ డోస్ బాగా పెంచి కనిపించారు. ఈ క్యారెక్టర్ గురించి అనుపమకు ఎన్నో ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 9:43 AM IST

DJ Tillu Heroine Anupama Parameshwaran Bold Role : అనుపమ పరమేశ్వరన్ ఫ్యామిలీ బ్యూటీ. హోమ్లీగా కనిపిస్తుంది. రింగురింగుల జట్టు, కట్టుబొట్టుతో సంప్రదాయంగా ఉంటుందంటారు సినీ అభిమానులు. ఇది ఇప్పటివరకు ఉన్న టాక్ మాత్రమే. టిల్లు స్క్వేర్ ట్రైలర్​తో ఆ ఫీలింగ్ పూర్తిగా మారిపోయింది. బోల్డ్ బ్యూటీగా యాక్టింగ్​తో ఇరగదీసింది అనుపమ. లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయ్యారు. టిల్లుగాడి అల్లరికి అనుపమ అందం తోడై బోల్డ్ సీన్స్ కిర్రాక్ ఉన్నాయని అంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో టిల్లు స్వ్కేర్ మూవీలో మూడో సాంగ్ రిలీజ్ కోసం తాజాగా ఓ ఈవెంట్ జరిగింది. ఓ మై లిల్లీ పాటను విడుదల చేసింది మూవీ టీమ్. బ్రేకప్ సాంగ్​గా ఎమోషనల్​గా సాగిందీ పాట. ఈ పాట విడుదల ఈవెంట్​కు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ కూడా హాజరయ్యారు.అనంతరం మీడియాతో ముచ్చటించారు. అయితే ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం గురించి అనుపమను వరుస ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో అనుపమా స్ట్రాంగ్​గా ఆన్సర్ ఇచ్చారు.

బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలానీ మీరు ప్రతిరోజూ బిర్యానీనే తింటారా? తినలేరు కదా? అంటూ రిపోర్టర్ ను అనుపమ తిరిగి ప్రశ్నించారు. తాను కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తానంటూ నొప్పించకుంటా చెప్పేసారు. డైరెక్టర్ ఇచ్చిన పాత్రకు నూటికి నూరుశాతం తన డ్యూటీ చేయడమే అంటూ గట్టిగానే సమాధానం చెప్పారు.

అనుపమ మాట్లాడుతూ "నేను ప్రతిరోజూ బిర్యానీ తినాలనుకోవడం లేదు. నాకు విభిన్న రుచులు కావాలి. పులావ్ కావాలి. పులిహోర కావాలి. డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్​ను వందశాతం చేయడం నా డ్యూటీ. అది చేయడానికి నేను ప్రయత్నం చేశాను" అంటూ బదులిచ్చారు.

కాగా, అనుపమ ఇంతకు ముందు నటించిన సినిమాల కన్నా భిన్నంగా టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేసింది. సిద్దుతో లిప్ లాక్ సీన్లలోనూ రెచ్చిపోయి నటించింది. వాస్తవానికి ఆ మధ్య రౌడీ బాయ్స్​ సినిమాలోనే ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేసింది అనుపమ. కానీ అప్పుడు ఎవ్వరూ పెద్దగా పటించుకోలేదు. అయితే ఇప్పుడు మరింత డోస్​ పెంచాక అనుపమ హాట్​ టాపిక్​గా మారిపోయింది. డీజే టిల్లు సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. తమన్ మ్యూజిక్ అందించారు.

SSMB 29 రిలీజ్ డేట్ - జపాన్​లో మహేశ్​ సినిమాపై జక్కన్న అదిరిపోయే అప్డేట్​

బాక్సాఫీస్ బరిలో మెగాహీరో అదిరే ఆట - రానున్న స్పోర్ట్స్ డ్రామాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.