ETV Bharat / entertainment

9 రోజుల క్రితం మిస్సింగ్ - నది ఒడ్డున శవమై తేలిన ప్రముఖ దర్శకుడు - దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం

Director Vetri Duraisamy Dead Body Recovered : 9 రోజుల క్రితం నదిలో కారు పడి మిస్సింగ్ అయిన ప్రముఖ దర్శకుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వెట్రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 7:18 AM IST

Director Vetri Duraisamy Dead Body Recovered : ఇంద్రావతు ఒరు నాల్ ఫేమ్ కోలీవుడ్​ దర్శకుడు వెట్రి దురైసామి(45) కారు నదిలో పడి ఆయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు తొమ్మిది రోజుల తర్వాత వెట్రి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళితే. హిమాచల్ ప్రదేశ్​కు తన స్నేహితులు గోపీ నాథ్ - తంజిన్‌లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు వెట్రి దురైసామి. ఆయన తన తదుపరి సినిమాల కోసం లొకేషన్స్​ చూసేందుకు అక్కడికి వెళ్లారని తెలిసింది. అయితే దారి మధ్యలో ఫిబ్రవరి 4న వారి కారు అదుపుతప్పి సట్లెజ్ నదిలో పడిపోయింది. కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో తంజిన్‌ గుండెపోటుకు గురయ్యారని అంటున్నారు. ఆ కారణంగానే అయన కారుపై నియంత్రణ కోల్పోగా, కారు బోల్తా కొట్టి నదిలో పడిందని తెలిసింది.

గోపీ నాథ్‌కు(32) తీవ్ర గాయాలు అవ్వగా, తంజిన్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గోపీ నాథ్​ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయాన్ని తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెట్రి కనిపించలేదు. మిగితా ఇద్దరి ఆచూకి మాత్రమే లభ్యమైంది. దీంతో అప్పటి నుంచి రెస్క్యూ టీమ్ వెట్రిని వెతుకుతూనే ఉంది. సెర్చ్ ఆపరేషన్‌లో రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు. అలానే ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ. కోటి రూపాయల రివార్డును కూడా ప్రకటించింది దర్శకుడి కుటుంబం.

అలా తొమ్మిది రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్ననూర్ జిల్లాలో దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం సట్లెజ్ నది ఒడ్డున దొరికింది. ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి పంపారు. ఆ తర్వాత దర్శకుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ఈ విషయం తెలియడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వెట్రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇలా జరగడం చాలా బాధకరమైన విషయమని విచారం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్టాలిన్ కూడా నివాళులు అర్పించారు. కాగా, దర్శకుడు వెట్రి హీరో అజిత్​కు మంచి స్నేహితుడు. వీరిద్దరు పలు ఫంక్షన్స్​లో చాలాసార్లు కలిసి కనిపించారు.

పవన్ ఫ్యాన్స్​కు వీరమల్లు టీమ్ సర్​ప్రైజ్​ - త్వరలో గ్లింప్స్​ రెడీ!

OTTలో భయపెట్టేందుకు మరో తెలుగు హారర్ మూవీ రెడీ - చూసే సాహసం చేయగలరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.