Kamal Hassan Uttama Villan : విలక్షణ నటుడు కమల్ హాసన్ వల్ల తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లింగుస్వామి. స్వతహాగా కమల్ హాసన్‌కు అభిమాని అయిన లింగుసామి నిర్మాతగా కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన "ఉత్తమ విలన్" సినిమాను తెరకెక్కించారు. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం తనను ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని లింగుస్వామి చెప్పుకొచ్చారు. ఉత్తమ విలన్ వల్ల తాను లాభాలు చూశానంటూ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో వచ్చిన కథనాలను ఖండిస్తూ లింగుస్వామికి ఈ విషయాన్ని తెలిపారు. ఆ కథనాల్లో నిజం లేదని, అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని చెప్పారు.
"నేను కంప్లైంట్ చేయాలనుకోవడం లేదు. కానీ, "ఉత్తమవిలన్" సినిమా నన్ను ఆర్థికంగా తేరుకోలేనంతగా, నష్టాల్లో కూరుకుపోయేలా చేసింది. అందుకోసం కమల్ నాతో రూ.30కోట్ల బడ్జెట్‌తో మరో సినిమా చేసిపెడతానని మాటిచ్చారు కూడా. ఈ విషయంపై ఆయన్ను తరచూ అడుగుతూనే ఉన్నా. ఇప్పటికీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు. అంతేకాదు "ఉత్తమ విలన్" సినిమాను తీయడానికి ముందు కమల్ హాసన్‌తో "క్షత్రియ పుత్రుడు", "విచిత్ర సహోదరులు" లాంటి సినిమాను తీయాలనుకున్నాను. కానీ కుదరలేదు. కథ మాకు చెప్పినప్పుడు మంచి కమర్షియల్ స్టోరీలా అనిపించింది. చెడ్డ గ్యాంగ్ దగ్గర ఇరుక్కుపోయిన ఒక అన్న తన తమ్ముడిని కష్టపడి కాపాడతాడనే ముందుగా కథలో ఉంది. ఇదే మాకు వినిపించారు. అందులో తమ్ముడి పాత్రను సిద్దార్థ పోషించాల్సి ఉంది. కానీ, కమల్ స్టోరీలో వారానికొక మార్పు చెబుతుండేవారు. అలా కథను మార్చి గతంలో హిట్లు కొట్టారు. బహుశా అదే నమ్మకంతో ఈ సినిమా తెరకెక్కి ఉంటుంది. కానీ ఈ చిత్రానికి నేను దర్శకుడిని ఉంటే కచ్చితంగా వేరేలా రియాక్ట్ అయ్యేవాడిని. నిర్మాతను కావడంతో ఏమీ అనలేకపోయాను" అని లింగుస్వామి వెల్లడించారు.
ఉత్తమ విలన్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత తాను పలు మార్పులు కూడా సూచించానని తెలిపారు లింగుస్వామి. మొదట ఓకే చెప్పిన కమల్ ఆ తర్వాత ఎలాంటి మార్పులు లేకుండానే విడుదల చేశారని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan