ETV Bharat / entertainment

'జవాన్​' సీక్వెల్ ? - అట్లీ ఏమంటున్నారంటే ?​ - Director Atlee About Jawan 2 - DIRECTOR ATLEE ABOUT JAWAN 2

Director Atlee About Jawan 2 : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ కాంబినేషన్​లో వచ్చిన 'జవాన్' ఎంతటి సక్సెస్​ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా సీక్వెల్​ గురించి డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Director Atlee About Jawan 2
Director Atlee About Jawan 2
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 11:36 AM IST

Updated : Mar 22, 2024, 12:40 PM IST

Director Atlee About Jawan 2 : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన సెన్సేషనల్ మూవీ 'జవాన్'. తమిళ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ సక్సెస్ సాధించింది. భారీ అంచనాలతో వచ్చి వాటికి మించిన రెస్పాన్స్ అందుకుని దూసుకెళ్లింది. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి డైరెక్టర్ అట్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"దీని గురించి నేను ఇప్పుడు చెప్పలేను. కానీ కచ్చితంగా ఓ సర్​ప్రైజ్​తో వస్తాను అని చెప్తున్నా. ప్రతి సినిమా సీక్వెల్ అయ్యే అవాకాశం ఉన్నప్పుడు నేను అనూహ్యమైన కంటెంట్​తో ఆశ్చర్యపరిచాను. ఈ సారి కూడా ఏదో ఒక సర్​ప్రైజ్ తెస్తాను. " అంటూ హింట్ ఇచ్చారు. అంతే కాకుండా షారుక్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి కూడా చెప్పారు. "షారుక్​తో పని చేయడం చాలా బాగుంది. ఆయన చాలా సరదాగా ఉండే వ్యక్తి. తన పనిలో చాలా సమయపాలనతో ఉంటారు. షారుక్​ నాకు ఓ సినిమా బైబిల్ లాంటి వారు. భవిష్యత్తులో ఆయనతో కచ్చితంగా పని చేస్తాను. అయితే ఎప్పుడు, ఎలా చేస్తాం అనేది షారుక్ సర్ చేతిలో ఉంది." అని అన్నారు.

ఇక అట్లీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా హిట్ మూవీస్​తో వావ్ అనిపిస్తున్నారు ఈ కుర్ర దర్శకుడు. 'రాజా రాణి', 'తెరి', 'మెర్సల్', 'జవాన్' లాంటి సినిమాలతో వచ్చి బంపర్ హిట్స్ అందుకున్నారు. షారుక్ ఖాన్​తో కలిసి చేసిన 'జవాన్' సినిమా అట్లీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఎంతటి రికార్డులు బద్దలుకొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతోనే బాలీవుడ్​లోనూ అట్లీ డైరెక్టర్​గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

మరోవైపు అట్లీ ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో 'వీడీ 18' సినిమా చేస్తున్నాడు. మురాద్ ఖేతానీ సహకారంతో అట్లీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అట్లీతో వరుణ్‌కి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. కీర్తి సురేశ్​ ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా, వామికా గబ్బి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Jawan Atlee Film : 'అదే నా సక్సెస్ ఫార్ములా'.. జవాన్ బడ్జెట్​ చెప్పిన అట్లీ.. వామ్మో ఎన్ని వందల కోట్లో

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే!

Last Updated : Mar 22, 2024, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.