ETV Bharat / entertainment

ధనుశ్ సినిమాలో పాన్​ఇండియా బ్యూటీ - 'తేరే ఇష్క్‌ మే' షూటింగ్ ఎప్పుడంటే? - Dhanush New Bollywood Movie - DHANUSH NEW BOLLYWOOD MOVIE

Dhanush Tere Ishq Mein Heroine : తమిళ నటుడు ధనుశ్ అప్​కమింగ్ బాలీవుడ్ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ నటించనుందట. ఇంతకీ ఆమె ఎవరంటే?

Dhanush Tere Ishq Mein Heroine
Dhanush (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 6:41 AM IST

Dhanush Tere Ishq Mein Heroine : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'రాంఝనా'. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయితే ఇందులోని పాటలు, అలాగే ధనుశ్​ యాక్టింగ్​కు మూవీ లవర్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈయన హిందీలో నటించిన 'షమితాబ్', 'అత్రంగీ రే' కూడా మిశ్రమ ఫలితాలనే అందుకున్నాయి. కానీ ధనుశ్ మాత్రం అక్కడి ప్రేక్షకలకు బాగా దగ్గరయ్యారు.

ఇక తాజాగా ఈ స్టార్ హీరోతో 'రాంఘనా' డైరెక్టర్ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మరోసారి సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. తన అప్​కమింగ్ ప్రాజెక్ట్ అయిన 'తేరే ఇష్క్‌ మే' కోసం ధనుశ్​ను మెయిన్ లీడ్​గా ఎంచుకున్నారు. 'రాంఝనా' తరహాలోనే ఓ విషాద ప్రేమకథను ఆయన రూపొందిచనున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావొస్తున్నుప్పటికీ ధనుశ్​ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల దీని నిర్మాణం కాస్త ఆలస్యమైంది. ఒకవేళ అన్నీ సెట్ అయితే దాదాపు ఈ ఏడాది అక్టోబరులోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమాలో ధనుశ్​ ప్రియురాలిగా 'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీమ్​ ఆమెకు కథ చెప్పగా, త్రిప్తి దానికి ఓకే చెప్పినట్లు సినీ వర్గాల టాక్. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు.

ఇక ధనుశ్ ప్రస్తుతం 'కుబేర' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ జానర్​తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై పీ రామ్మెహన రావు, సునీల్ నారంగ్‌, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమను పాన్ఇండియా లెవెల్​లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి ధనుశ్, నాగార్జున ఫస్ట్​ లుక్​ కూడా రివీల్ అయ్యింది. రిలీజైన మూడు లుక్స్​ కూడా అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

చెత్తలో 10 గంటలు మాస్క్ లేకుండా - కుబేర కోసం ధనుశ్ భారీ రిస్క్​! - Kubera Dhanush

ఇళయరాజా బయోపిక్- ఇదెక్కడి ట్విస్ట్ సామీ! సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్​!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.