Dhanush 3 Movie Re Release : కొంత కాలంగా సౌత్‌లో ముఖ్యంగా టాలీవుడ్‌లో పాపులర్ మూవీస్, రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. క్లాసిక్ హిట్స్‌ని మరోసారి ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రీ రిలీజ్‌లో కూడా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. త్వరలో మరో పాపులర్ మూవీ రి రిలీజ్‌కి సిద్ధమైంది. ధనుశ్, శ్రుతి హాసన్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ '3'ని మరోసారి భారత్ అంతటా రీ రిలీజ్ చేయనున్నారు.
'త్రీ' రీ రిలీజ్ ఎప్పుడు?
కొన్ని నివేదికల ప్రకారం, త్రీ మూవీ సెప్టెంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో రామ్‌గా ధనుశ్, జననిగా శ్రుతి హాసన్ చేసిన మాయ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. టీనేజ్‌లో రామ్, జనని మధ్య ప్రేమ కథని మరోసారి స్క్రీన్‌పై చూడాలని ధనుశ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందమైన ప్రేమ కథ, అనూహ్యమైన మలుపు, అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులు వెండితెరపై మరోసారి చూడనున్నారు.
సినిమా ప్రత్యేకతలు ఇవే
ఈ మూవీలో ధనుశ్, శ్రుతి హాసన్ నటనకు ప్రశంసలు లభించాయి. 2012లో విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీనేజీ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుశ్ మెప్పించాడు. శ్రుతి హాసన్ కూడా అద్భుతంగా నటించింది.
ముఖ్యంగా ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఈ మూవీలో ధనుశ్ పాడిన, 'వై దిస్ కొలవెరి డి' సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరోసారి 'త్రీ' మూవీ మేజిక్‌ని వెండితెరపై ఫ్యాన్స్ అనుభూతి చెందనున్నారు.
ధనుశ్ అప్‌కమింగ్ మూవీస్
ఇటీవలే 'రాయన్'తో ధనుశ్ డైరెక్టర్‌గా, హీరోగా హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన తర్వాతి సినిమా 'కుబేర' కోసం సిద్ధమవుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'కుబేర'లో హీరో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కూడా కీలక పాత్రలు పోషించారు. శేఖర్ కమ్ముల ఈ మువీని డైరెక్ట్ చేస్తున్నారు. 'కుబేర' స్టోరీ గురించి స్పష్టత లేనప్పటికీ, ఇది ముంబయిలోని ధారవి మురికివాడల నేపథ్యంలో సాగనుందని సమాచారం.
హాలీవుడ్‌లోకి ధనుష్- ఎంట్రీ 'అవెంజర్స్'తోనే - Dhanush In Avengers
'అది నన్ను బాగా దెబ్బతీసింది - ఆ విషయం వల్ల డిప్రెషన్లోకి వెళ్లాను'