ETV Bharat / entertainment

ఆ నటితో 'కలర్ ఫొటో' డైరెక్టర్​ సందీప్ రాజ్ పెళ్లి!

పెళ్లికి సిద్ధమైన కలర్ ఫొటో డైరెక్టర్​ సందీప్ రాజ్​ - ఎప్పుడంటే?

Colour Photo Director Sandeep Raj Marriage
Colour Photo Director Sandeep Raj Marriage (source Alitho Saradaga Screenshot)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 3:58 PM IST

Colour Photo Director Sandeep Raj Marriage : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతోంది. కలర్ ఫొటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ త్వరలోనే వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు. ఇంతకీ, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే?

ఆ నటితో పెళ్లి(Sandeep Raj and Chandini Rao) - సందీప్ రాజ్​ చేసుకోబోయేది నటి చాందిని రావుని. ఆమె కొంత మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. 'కలర్ ఫొటో' చిత్రంలోనే ఓ కీలక పాత్రలో కనిపించింది. అప్పుడే వీరి పరిచయం మొదలైంది. ఆ తర్వాత సందీప్ రాజ్​ కథ అందించిన 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో ఓ పాత్ర పోషించింది చాందిని రావు. ఇంకా 'రణస్థలి' సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ మెరిసింది.

Sandeep Raj Wedding Date : సందీప్ రాజ్, చాందిని రావు నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖ పట్టణంలో జరుగుతుందని సమాచారం అందుతోంది. ఆ తర్వాత నెలలోపే ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెడతారట. డిసెంబర్ 7న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం అందుతోంది.

ఒకవేళ ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకుంటే, కృష్ణవంశీ - రమ్యకృష్ణ, గోల్డెన్ బెహల్ - సోనాలి బింద్రేలా పెళ్లి చేసుకున్న దర్శకుడు - హీరోయిన్ల లిస్టులో చేరిపోతారు.

Sandeep Raj Movies : ఇక సందీప్ రాజ్ సినీ కెరీర్​ జర్నీ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలైంది. 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్​తో పాటు 'ముఖ చిత్రం' సినిమాలకు కథలు అందించారాయన. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరికొన్ని కథలు కూడా ఆయన దగ్గర ఉన్నాయట. 2025లో ఆయన కొత్త సినిమా సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇండస్ట్రీలోకి మరో నందమూరి హీరో - హరికృష్ణ మనవడిని పరిచయం చేసిన వై.వి.ఎస్‌. చౌదరి

'నన్ను క్షమించండి - NBK 109 టైటిల్ అప్డేట్ అందుకే ఇవ్వలేకపోయాం' : నాగవంశీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.