ETV Bharat / entertainment

'ఈ వార్త అబద్దమైతే బాగున్ను - నిన్ను ఎంతగానో మిస్​ అవుతాను' - సినిమాటోగ్రఫర్ సెంథిల్ భార్య మరణం​

Cinematographer Senthil Wife Demise : సినిమాటోగ్రఫర్ సెంథిల్ సతీమణి రూహీ మరణవార్త ఎంతో మందిని కలిచివేసింది. ఆమె మృతి పట్ల పలువురు సన్నిహితులు, సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

Cinematographer Senthil Wife Demise
Cinematographer Senthil Wife Demise
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 12:18 PM IST

Cinematographer Senthil Wife Demise : ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్​ కుమార్ సతీమణి రూహీ గురువారం కన్నుమూశారు. ఆమె మరణ వార్త ఎంతో మందిని షాక్​కు గురి ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనలయ్యారు.

'ప్రియమైన రూహి నీ కోసం నేను ఇలాంటి పోస్ట్‌ వేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ నేను షాక్‌లోనే ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండు అని అనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నేను నిన్ను మిస్‌ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అంటూ చార్మీ తమ ఫ్రెండ్​షిప్​ను గుర్తుచేసుకుని ఎమోషనలయ్యారు.

ఇక మంచు లక్ష్మి కూడా రూహితో తనకున్న రిలేషన్​షిప్​ గురించి సోషల్ మీడియోలో పంచుకుని భావోధ్వేగానికి లోనయ్యారు. ఆమె తనకు వాట్సాప్​లో పంపంచిన చివరి మెసేజ్​ను పోస్ట్ చేశారు.

'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్‌ ఇదే! ప్రతి వారం నేను తనను జిమ్‌లో కలుస్తుండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు నాకు కనిపిస్తూ ఉండేది. తను ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఎంతో ఎనర్జిటిక్​గా డ్యాన్స్‌ చేసేవాళ్లం, నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. సెంథిల్‌, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే నా మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి జర్నీ చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్‌ ఇస్తూ సర్‌ప్రైజ్‌ చేసేదానివి ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని నేను ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్‌ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్‌ చేసుకుంటా. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అంటూ పోస్ట్ చేశారు.

'ఆర్​ఆర్​ఆర్​' సినిమాటోగ్రాఫర్ ఇంట విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.