Chiyaan Vikram Thangalaan Trailer : శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాలతో తెలుగులోనూ సూపర్ ఫాలోయింగ్ పెంచుకున్న చియాన్ విక్రమ్‌కు చాలా కాలంగా కమర్షియల్ హిట్ పడలేదు పొన్నియిన్ సెల్వన్‌తో కొంత మేర సంతృప్తి పరిచినా అది మల్టీస్టారర్ కావడం వల్ల ఫుల్‌మీల్స్ పడలేదు. కానీ సరైన బొమ్మ పడితే బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.
అయితే ఈ సారి తంగలాన్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యారు విక్రమ్. ఎప్పటిలాగే తనదైన భిన్నమైన పాత్ర, యాక్టింగ్, లుక్స్‌తో వస్తున్నారు. అలానే మరింత వైలెంట్‌గా కనిపిస్తున్నారు. పైగా కాలా, కబాలి వంటి సినిమాలు తీసిన పా రంజిత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. సోషల్ మీడియాలో దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ ప్రియులు దీన్ని చూసి ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్ అవుతున్నారు.
కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్‌లో కొందరు కార్మికుల జీవితాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. అయితే ఈ ప్రచార చిత్రంలో ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్టులు ఇచ్చారు మేకర్స్. అలానే కథను కూడా దాదాపుగా రివీల్ చేశారు. సాధారణంగా సినిమాల్లో హీరోకు విలన్‌గా మరో మెయిల్ లీడ్ యాక్టర్ నటిస్తుంటారు. కానీ ఈ చిత్రంలో మాత్రం హీరోను ఆపడానికి హీరోయిన్ క్యారెక్టర్‌ను బాగా వాడుకున్నారు దర్శకుడు. అంటే ట్రైలర్లో గమనిస్తే హీరోకు అడుగడుగునా తనకున్న అసాధారణ శక్తులతో అడ్డుపడుతుంది హీరోయిన్.
తంగలాన్ (విక్రమ్) - ఎక్కడో ఒక మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే తెగ జాతికి చెందినవాడు. దశాబ్దాల క్రితం భారతదేశం పరాయి పాలనలో ఉన్న సమయంలో సాగుతుందీ కథ. తంగలాన్ నివసించే ప్రాంతంలో ఉన్న కొండలో బంగారు నిధులు ఉన్నాయని ఒక ఇంగ్లీష్ దొర గుర్తిస్తాడు. వాటిని తవ్విస్తే కోరినవి ఇస్తానని ఆ తెగ జాతికి ఆశ చూపుతాడు. ఈ మాటల్ని నమ్మిన కొంతమంది తంగలాన్ తెగ ప్రజలు దాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు. మరి కొంతమంది ఆ కొండ దగ్గర దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయని అక్కడికి వెళ్లడానికి భయపడతారు. కానీ హీరో ధైర్యం చేసి కొంతమందిని తీసుకొని వెళ్తాడు. అయితే అతడికి అడుగడుగునా ఆటంకాలు ఎదురౌతుంటాయి. ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవడం జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఎవరికీ కనిపించని ఓ మాంత్రికురాలు ఆ గనికి రక్షణగా ఉంటుందని హీరో తెలుసుకుంటాడు. దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. అలా ఆ మాంత్రికురాలిని ఎదుర్కొనే క్రమంలో హీరో పైశాచికంగా, విచిత్రంగానూ ప్రవర్తిస్తాడు. మరి ఆ బంగారు కొండను తవ్వితే జరిగే పరిణామాలు ఏంటి? అసలు ఆ మాంత్రికురాలు ఎందుకు ఆ కొండను తవ్వనీకుండా అడ్డుకుంటుంది? హీరో ఎందుకలా పైశాచికంగా ప్రవర్తిస్తాడు? అనేది తెరపై చూడాల్సిందే.
మొత్తంగా ఈ ప్రచార చిత్రం విజువల్స్ టెర్రిఫిక్‌గా అనిపించాయి. ప్రొడక్షన్ వేల్యూస్ హైలైట్‌గా అనిపించాయి. అటవీ జాతి వీరుడిగా విక్రమ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. మాళవిక మోహనన్, పార్వతిల మేకోవర్ షాకింగ్‌గా ఉంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. మొత్తంగా వైలెంట్‌గా ఉన్న ఈ ప్రచార చిత్రం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
'భారతీయుడు 2' బుకింగ్స్ - టికెట్ రేట్స్ ఎంత పెంచారంటే?
'భారతీయుడు 2'కు మర్మకళ చిక్కులు - సినిమా ఆపాలంటూ పిటిషన్- విడుదల సాధ్యమేనా? - Kamal Haasan Indian 2