ETV Bharat / entertainment

2025 సంక్రాంతి క్లాష్- తండ్రికి పోటీగా కొడుకు- నిజమేనా? - Game Changer Release Date - GAME CHANGER RELEASE DATE

Chiranjeevi Vishwambara Movie : మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్​లో రూపొందుతున్న విశ్వంభర మూవీ రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు పోటీగా 'గేమ్ ఛేంజర్' రానుందట. ఆ విశేషాలు మీ కోసం.

Chiranjeevi Vishwambara Movie
Chiranjeevi Vishwambara Movie (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 3:59 PM IST

Chiranjeevi Vishwambara Movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఫాంటసీ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సీన్స్​ను కూడా షూట్ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ రిలీజయ్యే సమయానికి మరో సినిమాతో క్లాష్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రామ్ చరణ్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆయన డైరక్ట్ చేసిన 'ఇండియన్-2' సినిమా కూడా పలు కారణాలతో ఆలస్యంగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే 'గేమ్ ఛేంజర్' కూడా తమ విడుదల డేట్ మార్చుకోవాల్సి ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా, దిల్ రాజు కూడా 'గేమ్ ఛేంజర్​' కోసం తన నిర్మాణ సంస్థలో విడుదల కానున్న పలు సినిమాలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. అది గనుక నిజమైతే, రానున్న సంక్రాంతికి తండ్రీ తనయుల క్లాష్ ఫిక్స్ కానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 'గేమ్ ఛేంజర్' నార్త్ థియేటర్ రైట్స్ కూడా ఓ రేంజ్​లో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ. 75 కోట్లకు ఈ సినిమా రైట్స్​ను కొనుగోలు చేసినట్లు సమాచారం. గ్లోబల్ స్టార్​కు నార్త్​లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అక్కడ ఆ రేంజ్​లో క్లిక్ అయ్యింది. అందుకే ఆ సినిమాకు అటువంటి రెస్పాన్స్ వచ్చిందని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ స్టోరీ లైన్ కూడా చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది.

ఇక ఈ సినిమాలో రామ్​చరణ్ రాజకీయ నాయకుడు, ఐఎఎస్ పాత్రలో కనిపించనున్నారు. నటి అంజలీ, SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై శిరీశ్​తో సంయుక్తంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.

'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ - చెన్నైలో క్రేజీ ఎపిసోడ్స్ - Ram Charan Game Changer

రూ. 75 కోట్లకు అమ్ముడుపోయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ రైట్స్! - మరి భారతీయుడు 2 ? - Game Changer Movie North Rights

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.