ETV Bharat / entertainment

'వాళ్లిద్దరూ ఆ సీక్వెల్ చేయాలన్నదే నా కల': మెగాస్టార్ - Chiranjeevi On Ram Charan - CHIRANJEEVI ON RAM CHARAN

Chiranjeevi On Ram Charan: గ్లోబర్ స్టార్ రామ్​చరణ్- జాన్వీ కపూర్ కలిసి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ చేస్తే చూడాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రీసెంట్​గా సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రోగ్రామ్​లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

chiranjeevi on ram charan
chiranjeevi on ram charan
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 9:46 PM IST

Chiranjeevi On Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్​బస్టర్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్​ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వంభర షూటింగ్​కు కాస్త బ్రేక్ ఇచ్చి సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా రెండో పార్ట్​లో ఆయన కుమారుడు రామ్​చరణ్- జాన్వీకపూర్‌ కలిసి నటిస్తే చూడాలని ఉందని అన్నారు. ఇది తన కల అని, దానికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ చెప్పారు. అది త్వరలోనే జరగాలని ఆయన ఆశించారు.

ఇక రామ్​చరణ్- జాన్వీ కపూర్ కలిసి ఈ సినిమా చేస్తే బాగుంటుందని చిరంజీవి గతంలోనూ అభిప్రాయపడ్డాయి. ఆయన 150వ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విషయాన్ని చెప్పారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. గతనెల మార్చిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా 'ఆర్​సీ 17' వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కనుంది. ఇక సినిమాలో నటించే ఆర్టిస్ట్​ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక ఇదే ఈవెంట్​లో ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్‌ మసంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు చిరు సమాధానాలిచ్చారు. 'ఎలాంటి సినిమాల్లో మీకు నటించాలని ఉంది' అన్న ప్రశ్నకు చిరు రిప్లై ఇచ్చారు. 'మీరు అక్కడ కూర్చొన్న వ్యక్తి (యంగ్ హీరో తేజ సజ్జను చూపిస్తూ)ని చూశారా? అతడు రీసెంట్​గా హను-మాన్ సినిమా చేశాడు. అతడికి ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్​గ్రౌండ్​ లేదు. 25ఏళ్ల కింద చైల్డ్ ఆర్టిస్ట్​గా నాతో పలు సినిమాల్లో చేశాడు. నన్ను చాలా ఇష్టపడతాడు. నన్ను చూసి ఇస్పైర్ అయ్యాడు. ఇప్పుడు హను-మాన్ సినిమా చేశాడు. ఆ పేరుతోనే ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నా. ఇప్పుడు అతడు ఆ సినిమా చేశాక నాకు సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే అతడిని నేను వేరుగా చూడలేదు. నా ప్రయాణంలో అతడూ భాగమే. ఇప్పుడు తన నటనును యావత్ భారతదేశం ప్రశంసిస్తుంది' అని చిరంజీవి అన్నారు.

చరణ్, సుక్కు మూవీ - ఆ ఐదు నిమిషాలు లీక్ చేసిన రాజమౌళి - Rajamouli RC 17

'డాక్టర్' ​చరణ్​కు పవర్​స్టార్ స్పెషల్ విషెస్- ఆయన రియాక్షన్ ఇదే! - Ram Charan Pawan Kalyan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.