ETV Bharat / entertainment

'వీడు హీరో ఏంటి అన్నారు'- కట్ చేస్తే ఇండియా తొలి​ రూ.100కోట్ల స్టార్! - India First 100 Crore Movie

India's First 100 Crore Movie: బి గ్రేడ్ యాక్టర్ అని హీరోయిన్స్ కూడా ఆ హీరోతో పనిచేయడానికి ఇష్టపడలేదు కానీ ఒక్క సక్సెస్ అతన్ని స్టార్ హీరోని చేసింది, ఎవరా హీరో? హీరోయిన్స్ ఎందుకు అతనికి నో చెప్పారు?

Indias First 100 Crore Movie
Indias First 100 Crore Movie (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 1:37 PM IST

India's First 100 Crore Movie: సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో? ఎవరు అమాంతం సూపర్ స్టార్స్​గా మారిపోతారో? ఎవ్వరూ ఊహించలేరు. 1976లో 'మృగాయా' అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు మిథున్ చక్రవర్తి. ఆ సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అయితే బాలీవుడ్ పరిశ్రమలో టాలెంట్​తో పాటు అందం కూడా ముఖ్యమే. నేషనల్ అవార్డు వచ్చినా సరే సన్నగా, పెద్దగా రంగు లేని తనకు అవకాశాలు రాలేదని ఆయన ఇటీవల పాల్గొన్న సరిగమప షోలో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

'ఏ టాప్ హీరోయిన్ నాతో పని చేయడానికి ఇష్టపడలేదు. నేను ఒక చిన్న హీరో అనే ఉద్దేశంలో వాళ్లు ఉండేవారు. ఇండస్ట్రీలో చాలామంది నేనెప్పుడూ హీరోని కాలేనని, నన్ను హీరోగా తీసుకోరు అని కామెంట్ చేసేవారు. నేను ఇప్పుడు మీతో చెప్పలేని మాటలు నన్ను అన్నారు. నేను చాలా బాధపడ్డాను. సినిమాలు అనౌన్స్ చేశాక కూడా హీరోయిన్స్ నా మూవీ నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. నా తోటి నటులకు కూడా నేను ఎక్కడ స్టార్ అవుతానో అనే భయం ఉండేది. బాలీవుడ్​లో తెలుపు రంగు మీద ఉన్న ఇష్టం వల్ల రంగు తక్కువగా ఉన్నానని నన్ను చాలా సినిమాల్లోకి తీసుకోలేదు. అయితే ఆ సమయంలోనే 'టాక్దీర్' అనే మూవీలో నాకు హీరోయిన్​గా జీనత్ అమన్ నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం నన్ను ఏ గ్రేడ్ యాక్టర్​ని చేసింది. ఆ విషయంలో నేను జీనత్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను' అంటూ మిధున్ చక్రవర్తి చెప్పుకొచ్చారు.

మిధున్​కు ఈ కష్టాలన్ని 1982లో రిలీజైన 'డిస్కో డాన్సర్' మూవీతో తీరిపోయాయి. అప్పట్లో ఇండియాలో రూ.6 కోట్ల కలెక్షన్​తో సూపర్ హిట్టైందీ ఈ చిత్రం. ఇక ఓవర్సీస్​లో అయితే రూ.95 కోట్లు కలెక్షన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. 'షోలే', 'క్రాంతి' తర్వాత ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం 'డిస్కో డ్యాన్సర్'. ఈ రికార్డును పదేళ్ల వరకు ఏ చిత్రం బద్దలగొట్టలేకపోయింది. ఆ తర్వాత ఏడాది 'జీనత్ అమన్ తో టాక్దీర్'లో నటించి హిట్ కొట్టాక హీరోగా మార్కెట్ పెంచుకున్నారు. ఆపైన వచ్చిన సక్సెస్ మిధున్​ను సూపర్ స్టార్ చేశాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏకంగా 200 సినిమాలకు నో - హీరో అవ్వాల్సినోడు సీరియల్స్​ చేస్తున్నాడు! - Actor Rejected 200 Films

మనుషుల్ని చంపేసే దెయ్యంతో హీరో ప్రేమ కథ - సినిమా రిలీజ్ ఎప్పుడంటే? - Telugu New Horror Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.