ETV Bharat / entertainment

వరుసగా 11 ఫ్లాప్​లు- కెరీర్​లో ఎన్నో ట్రబుల్స్- కట్ చేస్తే రూ.300 కోట్ల స్టార్

11 బ్యాక్​ టు బ్యాక్ ఫ్లాప్ వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఏకంగా రూ.300కోట్ల సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. రీసెంట్​గా ఓ బ్లాక్​బస్టర్​ మూవీలో విలన్ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అతడి యాక్టింగ్​కి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిగ్​గా మారిన ఆ నటుడు ఎవరంటే?

Bobby Deol Career
Bobby Deol Career
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 6:24 PM IST

Bobby Deol Career: సినీఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. ఇప్పటికే అన్ని సినీ పరిశ్రమల్లో చాలా మంది స్టార్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరి కొంతమంది ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే అలా వచ్చిన అందరూ కెరీర్​లో సక్సెస్ అవ్వలేరు. ఎంత సార్ట్ కిడ్స్ అయినా ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు వారిని అక్కున చేర్చుకుంటారు. లేదంటే కనుమరుగవ్వాల్సిందే. అలాంటిది బాబీ దేఓల్ ఒకప్పుడు తన కెరీర్​లో 11 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్​లు ఎదుర్కొన్నాడు. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా వెండితెరపైకి విలన్​గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఫిదా చేశాడు.

బాలీవుడు మెగాస్టార్ ధర్మేంద్ర రెండు కుమారుడు బాబీ దేఓల్. అతడి అన్నయ్య కూడా సన్నీ దేఓల్ బాలీవుడ్​లో ఓ స్టార్ హీరోనే. 1977లో 8ఏళ్ల వయస్సులో 'ధరమ్ వీర్' మూవీతో చైల్డ్ ఆర్టీస్ట్​గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బాబీ దేఓల్. తర్వాత 'బర్సాత్ 1995'లో ట్వింకిల్ ఖన్నాతో కలిసి బాలీవుడ్​లో హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకంది. ఈ సినిమాతో బాబీ దేఓల్ ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 'గుప్త ది హిడెట్ ట్రూత్' సినిమాలో యాక్ట్ చేశాడు. కెరీర్ మంచి స్పీడ్ మీదున్న సమయంలో ఐశ్వర్యరాయ్​తో కలిసి నటించిన 'ఔర్ ప్యార్ హో గయా' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేసినా ఏదీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే వరుసగా 'చోర్ మచాయే షోర్', 'కిస్మత్', 'బర్దాష్త్', 'అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో', 'జుర్మ్', 'టాంగో చార్లీ', 'బర్సాత్', 'దోస్తీ-ఫ్రెండ్స్ ఫరెవర్', 'హమ్‌కో తుమ్సే ప్యార్ హై', 'షకలకా బూమ్' 11 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లుగా మిగిలాయి. 2012లో వచ్చిన 'హీస్ట్ ఫిల్మ్ ప్లేయర్స్‌'లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించాడు. కానీ ఆ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 2017లో 'పోస్టర్ బాయ్స్‌'లో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇక హీరోగా వరుస పరాజయాలను మూటగట్టుకున్న బాబీ దేఓల్ రూటు మార్చి విలన్ పాత్రలు చేయడం ప్రారంభించాడు. 'రేస్- 3' మూవీతో విలన్​గా కెరీర్ ప్రారంభించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత 'యమ్లా పగ్లా దీవానా ఫిర్ సేల్' లో నటించగా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. బాబీ దేఓల్ ఓటీటీలోనూ సంచలనం క్రియేట్ చేశాడు. 'క్లాస్ ఆఫ్ 83', ఆశ్రమం వంటి సిరీస్‌లతో తన మాయాజలాన్ని చూపించాడు.

ఆశ్రమం సక్సెస్ తర్వాత, తన రెండవ ఇన్నింగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్​లో వచ్చిన 'యానిమల్‌'తో అదిరిపోయే కమ్​బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో విలన్​గా యాక్ట్ చేశాడు. ఇప్పుడు, బాబీ దేఓల్​కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బాబీ తర్వాతి మూవీ రూ.300- 350కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సూర్య 'కంగువ'లో విలన్‌గా కనిపించనున్నాడు. శివకుమార్ జయకుమార్ హెల్మ్ చేసిన కంగువ తమిళ భాషా ఫాంటసీ యాక్షన్ చిత్రం. ఇందులో దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 11, 2024న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ డైరెక్టర్ల కెరీర్​లో రీమేక్​లకు నో ఛాన్స్​- ఈ లిస్ట్​లో పూరీ రూటే సెపరేటు

ఈ డైరెక్టర్ల ముద్దుల కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.