ETV Bharat / entertainment

BB4గా 'అఖండ 2' అఫీషియల్ అనౌన్స్​మెంట్ - ఇక తాండవమే - BB4 AKHANDA 2

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో కన్ఫామ్ అయిన 'అఖండ 2' - పోస్టర్ రిలీజ్​!

Balakrishna Boyapati srinu BB4 Akhanda 2
Balakrishna Boyapati srinu BB4 Akhanda 2 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 8:45 AM IST

Updated : Oct 16, 2024, 8:50 AM IST

Balakrishna Boyapati srinu BB4 Akhanda 2 : ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు ప్రత్యేక అభిమానులుంటారు. అలాంటి వాటిలో ఒకటి బాలకృష్ణ - బోయపాటిల కలియిక ఒకటి. వీరిద్దరి సినిమా వస్తుందంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్‌', 'అఖండ' మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ బ్లాక్​ బస్టర్స్​ను అందుకుని ఆడియెన్స్​ను ఓ ఊపు ఉపేశాయి. అయితే ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ మాస్‌ కాంబో రిపీట్‌ కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గానే అఫీషియల్​గా ప్రకటించారు.

అయితే ఈ సినిమా అఖండ 2నా లేదంటే కొత్త సినిమానా అనేది చాలా రోజులుగా సస్పెన్స్​లో పెట్టారు మేకర్స్. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్​. అఖండ 2 అని కన్ఫామ్ చేశారు. అఖండ 2 - తాండవం పేరుతో సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్లు తెలిపారు. టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ అఫీషియల్​గా విడుదల చేసింది. షూట్ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొంది. కాగా, 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో అఖండ 2ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కాగా, గతంలో "అఖండలో పసిబిడ్డ, ప్రకృతి. పరమాత్మ కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు" అని తెలిపారు దర్శకుడు బోయపాటి.

NBK 109 Movie Shooting : ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై ఓ చిత్రం చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ బాబీ దేవోల్‌ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందిస్తున్నారు.

దీపావళి రేస్​లో ప్రశాంత్ నీల్ కొత్త సినిమా - టపాసుల పండగకు రానున్న చిత్రాలివే!

వరుణ్, సమంత - సింగిల్ షాట్​లో 11 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్​

Last Updated : Oct 16, 2024, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.