Balakrishna 50 Years: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 2024 ఆగస్టు 30తో 50ఏళ్లు పూర్తవుతుంది. ఆయన నటించిన తొలి సినిమా 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న రిలీజైంది. అయితే కెరీర్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.
- ప్రతిరోజు బాలయ్య తెల్లవారుజామున 3.30 గంటలకే నిద్ర లేస్తారు. గంటపాటు వ్యాయమం చేస్తుంటారు. ఆ తర్వాత సూర్యోదయానికి ముందే పూజ కూడా అయిపోతుంది.
- ఆయన తండ్రి నందమూరి తారక తారక రామారావు సినిమాలు తప్ప బాలయ్య వేరేవి చూడరు. రోజూ ఎన్టీఆర్ సినిమా చూశాకే ఆయన నిద్రిస్తుంటారు.
- డైలీ న్యూస్ పేపర్ చదువుతారు. సినిమా కథల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ, పుస్తకాలు చదవడం మాత్రం తక్కువే.
- ఏదైనా తినాలి అనిపిస్తే, తినేయడమే. డైట్ పేరుతో నోరు కట్టేసుకోరు. కానీ, సినిమా పాత్రలకు తగ్గట్లు శరీరాకృతి మార్చుకుంటారు.
- సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పుటీకీ ఫ్యామిలీ మెంబర్స్‌కు టైమ్ కేటాయిస్తారు. వాళ్లతో సరదగా గడపడానికి ఇష్టపడుతారు.
- ఆయన విజయం వెనుక సతీమణి వసుంధర పాత్ర చాలా కీలకం అంటుంటారు. ఆమె తనను కంటికి రెప్పలా చూసుకుంటారని బాలయ్య చెబుతుంటారు.
- మనవళ్లతో ఉన్నప్పుడు బాలయ్య చిన్న పిల్లాడిలా మారిపోతారు. వారిని సీఎం (క్లాస్ మనవడు), ఎంఎం (మాస్ మనవడు) అని పిలుస్తుంటారు.
- అప్పట్లో క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. స్కూల్‌డేస్‌లో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్, బాస్కెట్ బాల్, కబడ్డీ టీమ్ కెప్టెన్‌గా ఉండేవారు.
- తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన డిజైన్ ఆధారంగానే బాలయ్య ఇల్లు నిర్మించుకున్నారు.
- బాలకృష్ణకు లక్ష్మీనరసింహ స్వామి అంటే అమితమైన భక్తి. సినిమాల పరంగా కూడా 'సింహా' పేరు ఆయనకు సెంటిమెంట్ అని చెప్పవచ్చు.
- తెలుగు భాష అంటే ఎంతో మమకారం. ఓ మాస్టారు బాలయ్యకు పద్యాలు నేర్పేవారు. నేర్చుకోకపోతే తొడపాశం పెడతారనే భయంతో నేర్చుకునేవారంట.
- నెగిటివ్ ఆలోచనలు, కల్మషం లేకపోవడమే తన ఆరోగ్య రహస్యమని ఓ సందర్భంలో చెప్పారు.
బాలకృష్ణ తండ్రిని ఇంతగా గౌరవిస్తారా!! - Balakrishna About His Father
ఒకే ఏడాదిలో 6 బ్లాక్‌బస్టర్స్ - ఆ రేర్ రికార్డు బాలయ్యకే సొంతం! - Balakrishna Hit Movies List