Ayushmann Khurrana Andhadhun Movie : ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సాధారణంగా వచ్చి అనూహ్య విజయాలను సాధిస్తాయి. అలా బాలీవుడ్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఓ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా విమర్మకుల ప్రశంసలు కూడా అందుకుంది. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఆడియెన్స్‌ను అలరించింది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ సందడి చేసింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు కోలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన 'అంధాధున్'.
బీటౌన్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు లాంటి స్టార్స్ నటించిన ఈ మూవీ భారత్‌లో దాదాపు 800 స్క్రీన్లలో విడుదలైంది. కేవలం రూ. 32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతే కాకుండా చైనాలోనూ ఈ సినిమా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. 'పియానో ప్లేయర్' అనే టైటిల్‌తో రిలీజైన ఈ మూవీ ఓ అరుదైన రికార్డును కూడా అందుకుంది. చైనాలో విడుదలైన నాన్ హాలీవుడ్ టాప్ 10 సినిమాల జాబితాలో చేరి చరిత్రకెక్కింది.
Andhadhun China Collections : ఇక చైనాలో విడుదలయ్యేందుకు ముందే 'అంధాధున్' ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్లకు మేర వసూలు సాధించింది. అయితే చైనాలో విడుదలైన 13 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటింది. అలా 'అంధాధున్' వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ. 335 కోట్లు వసూలు చేసింది. క్రమ క్రమంగా ఆ సంఖ్య కాస్త రూ. 456.89 కోట్లకు చేరుకుంది.
Andhadhun National Award : ఈ సినిమాలో తనదైన రీతీలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయుష్మాన్ ఖురానా. ఆయన ఓ అంధ పియానిస్ట్‌గా మెప్పించారు. ఇక ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్‌కు గానూ 2019లో జాతీయ ఉత్తమనటుడు పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో పాటు పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ (క్రిటిక్) సైతం ఆయన్ను వరించింది.
Andhadhun Telugu Remake : విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగులో హీరో నితిన్ మెయిన్ లీడ్ రోల్లో 'మాస్ర్టో'గా ఈ సినిమా తెరక్కకింది. 'భ్రమమ్' అనే పేరుతో మలయాళంలో ఈ సినిమాను రీమేక్ చేశారు. 'సలార్' ఫేమ్ మలయాళ నటుడు పృథ్యీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత తమిళంలోనూ ఈ సినిమా రూపొందింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">