AP Elections 2024 PawanKalyan Sai Tej Video Viral : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాలు వచ్చేశాయి. తేదేపా, భాజాపా, జనసేన కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తేదేపా, జనసేన పార్టీ వర్గాల్లో, అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొందరు నేరుగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయితే ఎన్నికల ఫలితాలు రాగానే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్‌తేజ్‌తో పాటు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నారు. అయితే మంగళగిరికి చేరుకున్నాక సాయి తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను గట్టిగా హత్తుకుని మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధిత వీడియోను షేర్ చేస్తూ "మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్ కల్యాణ్ నా హీరో, గురువు" అని పవన్‌పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తూ కామెంట్లు కురిపిస్తున్నారు. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా, తన పార్టీలో ఉన్నవారందరూ మంచి విజయాన్ని అందుకునేలా కృషి చేశారు పవన్. దీంతో ఈ విజయానికి సంతోషిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్‌ను ప్రశంసిస్తూ ఓ సూదీర్ఘ పోస్ట్‌ను చేశారు. ప్రస్తుతం ఇది కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
చంద్రబాబు, పవన్ భేటి - కాగా, ఫలితాల అనంతరం చంద్రబాబు, పవన్కల్యాణ్ తొలిసారి భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలతో పాటు, వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
బాలయ్య హ్యాట్రిక్ విక్టరీ - వైరల్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి పోస్ట్! - AP Elections 2024
పవన్ కల్యాణ్ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్ - Pawankalyan Renudesai
నా హృదయం ఉప్పొంగుతోంది : పవన్ విజయంపై చిరు హర్షం - AP Elections 2024