ETV Bharat / entertainment

'ఆ యాంకర్​ను చూసి నాకు అసూయ వచ్చింది' - Anchor Suma Birthday - ANCHOR SUMA BIRTHDAY

Anchor Suma Birthday : అందం, అభినయంతో పాటు ఆకట్టుకునే మాటలు. ఆ మాటలతోనే కోటలు కట్టిన మేటి మాటకారి ఆమె. వ్యాఖ్యాతలు సైతం సెలబ్రిటీ స్టేటస్ చవి చూస్తారని నిరూపించిన ఘనత ఆమెది. అయితే నటి కావాలని పాతికేళ్ల క్రితం బయలుదేరిన ఆమె, వెండితెరపై వెలగలేకపోయింది. కానీ వందలాది చిత్రాలు వెండితెరపై వెలగబోయే ముందు జరిగే ఫంక్షన్లలో మాత్రం ఆమె గాత్రం వినిపించాల్సిందే. అది ఆమె స్టేటస్​ ఆమె ఎవరో కాదు సుమ కనకాల. మార్చి 22న సుమ కనకాల పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సుమ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Anchor Suma Birthday
Anchor Suma Birthday
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 6:50 AM IST

Anchor Suma Birthday : తెలుగు యాంకర్లలో స్టార్ యాంకర్ ఎవరంటే అంతా సుమ పేరును ఠక్కున చెప్పేస్తారు. తెలుగు ఆడపడచు కాకపోయినా తెలుగుని స్పష్టంగా మాట్లాడటంలో ఆమెకు ఆమె సాటి. మాటలతోనే కోటలు కడుతుంటారు ఆమె. అదే మాటలతోనే ఆకట్టుకోవడంలోనూ ఆమె సాటి ఎవరూ లేరని చెప్పవచ్చు. యాంకరింగ్​లో తనదైనశైలితో దూసుకుపోతుంటారు. యాంకరింగ్ అంటే సుమ. సుమ అంటే యాంకరింగ్ అనేంత పేరు సంపాదించుకున్నారు. ఆమె నవ్విస్తూనే అందర్నీ ఆలోచింపచేస్తుంటారు. భాషపై ప్రేమను పెంచుతుంటారు. తెలుగమ్మాయి కానప్పటికీ, మన సంప్రదాయాల విలువేంటో చాటి చెబుతుంటారు. మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు. ఈ సందర్భంగా బుల్లితెర మహారాణి అని నిరూపించిన సుమ గురించి కొన్ని విశేషాలు మీ కోసం.

ఆ లవ్ లెటర్ :
స్టూడెంట్ లైఫ్​లో తనకొచ్చిన ఓ లవ్ ప్రపోజల్ గురించి సుమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఓ కుర్రాడు లవ్ లెటర్ ఇచ్చిన విషయాన్ని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు. అతడు సైన్స్ స్టూడెంట్ అని, పూర్తిగా సైంటిఫిక్ పదాలతో రాశాడని, అంతే కాకుండా ఆ ప్రేమ లేఖలో 'నీ ప్రేమ నన్ను గురుత్వాకర్షణ శక్తివలే లాగుతోంది' అని రాశాడంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత అతన్ని ఆమె అన్నయ్య అని పిలిచానంటూ చెప్పుకొచ్చారు సుమ. 'మా అమ్మాయిల దగ్గర ఉండే అస్త్రం అదే' అంటూ నవ్వారు.

ఆ యాంకర్​ను చూస్తే అసూయ :
సుమ స్టార్ యాంకర్. కానీ తాను కూడా ఓ యాంకర్​ను చూసి జెలసీగా ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. "ఈర్ష్య లేని మనిషి ఉంటే అదివేరే స్థాయిలో ఉండాలి. కానీ అలా ఉండటం చాలా కష్టం. ప్రతి మనిషిలోనూ ఈర్ష్య కలుగుతుంది. నాకు యాంకర్ అనసూయను చూసినప్పుడు ఈర్ష్య కలిగింది. అలా ఈర్ష్య అనను కానీ తనంత ఎత్తు లేనని అనిపించింది. అయిన అది అమ్మాయిలకు స్వతహాగా వచ్చే చిన్నపాటి కుల్లు" అంటూ చెప్పుకొచ్చారు సుమ.

స్టేజిని చూస్తే ఇక అంతే :
తనకు స్టేజిని చూస్తే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని అన్నారు సుమ. కొందరికి స్టేజ్ ఎక్కాలంటే భయం వేస్తుంది. కానీ నాకు మాత్రం ఎక్కడా లేని ఊపు, ఉత్సాహం వస్తుందని చెప్పారు. "పంచ్​ల కోసం నేనెప్పుడూ ప్రత్యేకంగా కసరత్తు చేయను, కానీ ఒక షోలోకి అడుగుపెడుతున్నానంటే దాని నేపథ్యం, సారాంశమేంటో గ్రహించి అక్కడ ఎలా మాట్లాడాలో ముందుగా ఓ అవగాహనకు వస్తాను. ఆ తర్వాతే స్టేజిపైకి వెళ్లి మాట్లాడం దానంత అదే మొదలౌతుంది" అని చెప్పారు సుమ.

యాంకర్​ సుమ మంచి మనసు.. 30 మంది విద్యార్థులను దత్తత

యంకర్ సుమ గొంతు పట్టుకున్న హీరో గోపిచంద్​.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.