ETV Bharat / entertainment

చేతబడి, వశీకరణ - భయపెడుతున్న తెలుగుమ్మాయి అనన్య 'తంత్ర' ట్రైలర్! - Ananya Nagalla Tantra Trailer

మార్చి నెలలో రాబోయే రెండు చిత్రాలు సినీ ప్రియుల్లో బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందులో ఒకటి చేతబడి, వశీకరణ లాంటి అంశాలతో తెరకెక్కిన హారర్ మూవీ తంత్ర, మరొకటి క్రైమ్ థ్రిల్లర్​ భూతద్దం భాస్కర్‌ నారాయణ. తాజాగా ఈ రెండు చిత్రాల ట్రైలర్లు విడుదలై క్యూరియాసిటినీ బాగా పెంచుతున్నాయి. వాటిని చూసేద్దాం.

చేతబడి, వశీకరణ - భయపెడుతున్న తెలుగుమ్మాయి అనన్య 'తంత్ర' ట్రైలర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 12:45 PM IST

Ananya Nagalla Tantra Trailer : టాలీవుడ్‌లో ఈ మధ్య హారర్​ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది. తాజాగా అదే జానర్​లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అదే తంత్ర. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలై ఆసక్తికరంగా భయపెడుతూ సాగింది. చేతబడి, వశీకరణ లాంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిందీ సినిమా. ఈ ప్రచార చిత్రం మొత్తం ఆసక్తికరంగా కొనసాగేలా చేసి చివరి ఒకే ఒక్క డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి. అప్పట్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా ఈ తాంత్రిక సాధన చేశారని బాగా పుకార్లు వచ్చాయి అంటూ మరింత ఇంట్రెస్ట్​ను క్రిియేట్ చేశారు. మార్చి 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ హారర్ చిత్రంలో అనన్య నాగళ్లతో పాటు సీనియర్ నటి సలోని కూడా నటించింది. మరి వీరిద్దరికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhutaddam Bhaskar Trailer : ఈ మార్చిలో విడుదల కానున్న మరో సినిమా భూతద్దం భాస్కర్‌ నారాయణ. క్రైమ్ థ్రిల్లర్​గా ఇది రూపొందింది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్​ను అలరించాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన రిలీజ్​ ట్రైలర్​ కూడా మరింత బాగా ఆకట్టుకుంది. ఇందులో చెక్కతో చేసిన దిష్టి బొమ్మలు, సైకో కిల్లర్ చంపేసిన వారి శవాలు తూర్పు దిక్కుకే ఉండటం, ఆ కిల్లర్​ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా ఎంగేజింగ్​గా సాగింది. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం వేరె లెవల్​లో ఉందనే చెప్పాలి. ప్రొడక్షన్ వ్యాల్యూస్​ కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్​గా మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ భూతద్ధం భాస్కర్ నారాయణ చిత్రం మార్చి 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్యాన్సర్​తో 2017 మిస్​ ఇండియా ఫైనలిస్ట్ కన్నుమూత​

మార్చి నెల ఓటీటీ సినిమా సిరీస్​ల ఫుల్ లిస్ట్​ - హనుమాన్​తో పాటు ఏం వస్తున్నాయంటే?

మార్చి నెల థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే - ఆ 3 చిత్రాలు వెరీ స్పెషల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.