Kaun Banega Crorepati Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిగ్ బీ, తన సతీమణి జయా బచ్చన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కాల్ చేస్తే తాను ఎందుకు టెన్షన్ పడతారో చెప్పారు.
"ఇంట్లో రిలేటివ్స్ ఉన్నా, ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా జయ వాళ్లతో బెంగాలీలోనే మాట్లాడుతుంది. ఆమె ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా పక్కన ఎవరైనా ఉంటే ఆ భాషలోనే మాట్లాడుతుంది. నాకేమో ఆ భాష అర్థం కాదు. కానీ నేను అర్థమైనట్టు నటిస్తాను (నవ్వులు). ఇప్పటికీ నేను బెంగాలీ మాట్లాడటానికి కష్టపడతాను. నాకు ఎక్కువగా ఆ భాష తెలీదు. కొంచమే అర్థమవుతుంది." అని చెప్పుకొచ్చారు.
ఇక తన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు అమితాబ్. "ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నేను బెంగాలీ మహిళను పెళ్లి చేసుకున్నాను. నా సోదరుడు సింధీ మహిళను, నా కూతురు పంజాబీ అబ్బాయిని, నా కుమారుడు (అభిషేక్ బచ్చన్) మంగళూరు అమ్మాయిని (ఐశ్వర్యా రాయ్) చేసుకున్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన వారు మన ఫ్యామిలీలో ఉండాలని మా నాన్న చెబుతుంటారు." అని గుర్తుచేసుకున్నారు.
ఇక ఇదే షోలో హీరో హృతిక్ రోషన్‌పై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. హృతిక్ మొదటి సినిమా రిలీజ్ రోజు, స్నేహితులతో కలిసి థియేటర్ వెళ్లి చూశానని, ఆ తర్వాత హృతిక్ డ్యాన్స్‌ను కాపీ కొట్టే ప్రయత్నం చేశానని కాసేపు నవ్వులు పూయించారు.
Amitabh Bachchan Upcoming Movies : ఇక అమితాబ్ సినిమాల విషయానికొస్తే, రీసెంట్‌గానే కల్కి 2898 ఏడీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. అందులో తన నటనకు గానూ ప్రశంసలను దక్కించుకున్నారు. ఆ తర్వాత రజనీకాంత్‌తో కలిసి వేట్టాయన్ అనే సినిమా చేశారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నారు.
'ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు- అందుకే ఆ అమితాబ్ సినిమా అంటే నాకిష్టం లేదు' - కమల్ హాసన్
'రామాయణ'లో మరో బడా స్టార్! - రణ్‌బీర్, సాయి పల్లవితో పాటు ఆయన కూడా!