ETV Bharat / entertainment

యూట్యూబ్​ టూ సిల్వర్ స్క్రీన్​- హ్యాట్రిక్​కు థాంక్స్- సుహాస్ ప్రెస్​నోట్ - suhas movies

Ambajipeta Marriage Band Suhas: యంగ్ హీరో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ఆడియెన్స్​కు హీరో సుహాస్ ప్రెస్​నోట్​ ద్వారా థాంక్స్ చెప్పారు.

Actor Suhas Ambajipeta Marriage Band
Actor Suhas Ambajipeta Marriage Band
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 7:00 AM IST

Updated : Feb 10, 2024, 8:44 AM IST

Ambajipeta Marriage Band Suhas : టాలీవుడ్ నటుడు సుహాస్ 'కలర్ ఫొటో' సినిమాతో హీరోగా పరిచయమై 'రైటర్ పద్మభూషణ్'తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. లేటెస్ట్​గా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'తో కెరీర్​లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. విలేజ్ బ్యాక్​డ్రాప్​తో ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్​ వస్తోంది. దీంతో తనను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు హీరో సుహాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు.

'అందరికి నమస్కారం, మేం అనుకున్నట్లుగానే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాను ప్రేమతో ఆదరిస్తున్న అందరికీ థాంక్స్​. యూట్యూబ్​లో నా షార్ట్ ఫిల్మ్స్​ కి కామెంట్స్​ పెట్టడం నుంచి ఇవాళ బుక్​ మై షోలో టికెట్లు కొనే వరకు నన్ను ప్రేమతో నడిపిస్తున్నారు. ఈ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను' అని అన్నారు. ప్రస్తుతం సుహాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి సినిమాలతోపాటు సందీప్​రెడ్డి బండ్ల- దిల్​రాజు కాంబోలో ఓ ప్రాజెక్ట్​ ఓకే చేశారు. ఇక ప్రసన్న వదనం సినిమా వచ్చే నెలలో థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

Ambajipeta Marriage Band Collection: ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్​ టార్గెట్ రీచ్ అయ్యింది. ఇక తొలి వారంలో వరల్డ్​వైడ్​గా రూ.11.7 కోట్లు వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్​లోనూ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అదరగొడుతోంది. ఇప్పటికే ఓవర్సీస్​లో 200K డాలర్ల మార్క్ క్రాస్ చేసింది.

Ambajipeta Marriage Band Cast: ఈ సినిమాలో యంగ్ నటి శివాని హీరోయిన్​గా నటించగా శరణ్య, గోపరాజు రమణ, పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, నితిన్ ప్రసన్నా, వినయ్ మహాదేవ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, వెంకట్​ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందించగా వాజిద్‌ బేగ్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'- బ్రేక్ ఈవెన్ క్రాస్ - 3రోజుల వసూళ్లు ఎంతంటే?

తండ్రైన 'కలర్‌ ఫొటో' హీరో సుహాస్​ - ప్రొడక్షన్ నెం.1 అంటూ ఫొటో షేర్​

Last Updated : Feb 10, 2024, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.