ETV Bharat / entertainment

నేనిలా ఉండటానికి నువ్వే కారణం - బన్నీ ఎమోషనల్​ - అల్లుఅర్జున్ స్నేహా లవ్​స్టోరీ

తానిలా ఉండటానికి గల కారణమైన వ్యక్తి గురించి చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలు.

నేనిలా ఉండటానికి నువ్వే కారణం - బన్నీ ఎమోషనల్​
నేనిలా ఉండటానికి నువ్వే కారణం - బన్నీ పోస్ట్ వైరల్
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 12:32 PM IST

Allu Arjun Sneha Reddy Post : పుష్ప చిత్రంతో ఇండియా వైడ్​గా క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్​. స్టైలిష్​ స్టార్​ నుంచి ఐకాన్​ స్టార్​గా ఎదిగారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2తో​ బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ఓ వైపు సినిమా షూటింగ్​లో ఉంటూనే మరోవైపు ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"మన పెళ్లై 13 ఏళ్లు అయిపోయింది. నేను ఇలా ఉండటానికి కారణం నీతో ఉన్న బంధమే. నీ ప్రశాంతత గుణంతో నాకు బోలెడంత శక్తిని ఇచ్చావు. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ క్యూటీ" అని అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఉన్న ఫొటోనూ పోస్ట్ చేసి ఇన్ స్టా స్టోరీస్​లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

కాగా, నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగుతో పాటు మలయాళంలోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ జర్నీలోనే పర్సనల్​ లైఫ్​లో 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు అయాన్, అర్హ జన్మించారు. ఇక రెండేళ్ల క్రితం పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్​లో అభిమానగణాన్ని క్రేజ్ దక్కించుకున్నారు.

Allu arjun Pushpa 2 Movie : పుష్ప 2 సినిమా విషయానికొస్తే చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్​గా నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫజిల్​ సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో సినిమాను తెరకెక్కిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్​. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్​, గ్లింప్స్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో భారీ వ్యూస్​ను దక్కించుకున్నాయి.

RC16 హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది - చరణ్ సరసన ఎవరంటే?

జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్​ చేసుకోలేదట - ఈ సీక్రెట్​ మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.