ETV Bharat / entertainment

అల్లు అర్జున్​తో పాన్ ఇండియా సినిమా! అట్లీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? - Allu Arjun Movie Atlee Remunaration

Allu Arjun Movie Atlee Remunaration : ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​తో చేస్తున్న సినిమా కోసం ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన గురువు శంకర్​ కన్నా ఎక్కువ మొత్తం వసూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అట్లీ ఎన్ని కోట్లు పారితోషికం తీసుకుంటున్నారంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 10:45 AM IST

Allu Arjun Movie Atlee Remunaration : ఐకాన్​స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందనని ఇదివరకే కొన్ని కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో వార్త హాట్​ టాపిక్​గా మారింది. ఈ సినిమా కోసం దర్శకుడు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ వసూలు చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. తన గురువు, ప్రముఖ దర్శకుడు శంకర్ కన్నా అట్లీ ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారట. ఈ పాన్​ ఇండియా సినిమా కోసం అట్లీ దాదాపు రూ.60 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే శంకర్​ ఒక సినిమాకు రూ.25 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటారని టాక్ ఉంది. దీంతో తన గురువు రికార్డ్​ను అట్లీ అధిగమించినట్లు అవుతుంది.

ఇదిలా ఉండగా బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​తో అట్లీ 'జవాన్​' తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి బ్లాక్​బస్టర్​గా నిలిచింది. దీంతో అట్లీకి డిమాండ్​ పెరిగింది. ఈ కారణంగా ఆయన కోరినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనకాడటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే మొత్తంలో రెమ్యునరేషన్​ తీసుకుంటే, కోలీవుడ్​లో అత్యధిక పారితోషికం తీసుకున్న డైరెక్టర్ల జాబితాలో అట్లీ చేరనున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే, ఇందులో బన్నీ కంప్లీట్ డిఫరెంట్ లుక్​లో కనిపించనున్నారట. ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభించాలని అట్లీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైతే దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి వివరాలు అధికారికం​గా అనౌన్స్​ చేస్తారని టాక్.

మ్యూజిక్​ డైరెక్టర్ ఫిక్స్!
షారుక్​ ఖాన్- అట్లీ కాంబోలో తెరకెక్కిన 'జవాన్' వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.1000 కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్​పై అప్పట్లో అల్లు అర్జున్ మూవీటీమ్​కు ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే బన్నీ ఈ ట్వీట్​ పోస్ట్​ చేసిన కొంతసేపటి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ 'థాంక్యూ మై బ్రో' అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి బన్నీ 'థాంక్యూ సరిపోదు నాకు మంచి పాటలు కావాలి' అంటూ అనిరుధ్​ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. దీంతో అట్లీ-అర్జున్-అనిరుధ్(AAA) కాంబోలో త్వరలోనే ఓ ప్రాజెక్ట్​ తెరకెక్కనుందంటూ అప్పటి నుంచే సామాజిక మాధ్యమాల్లో వార్తలు ట్రెండ్​ అవుతున్నాయి. అయితే ఈ సినిమాను సన్​ పిక్చర్స్​ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ త్రిష కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

బంపర్​ ఆఫర్​ కొట్టేసిన మృణాల్​ ఠాకూర్! పాన్​ ఇండియా స్టార్​తో సినిమా?

వచ్చే ఏడాదే స్టార్ హీరోయిన్​తో టిల్లుగాడి పెళ్లి!- క్లారిటీ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.