Allu Arjun Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప- 2' క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఆ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి బన్ని గురువారం ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ఆయన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బన్ని ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతూ పుష్ప సినిమా గురించి మాట్లాడారు.
ఫ్యాన్స్ లవ్ యూ
అభిమానులంటే ఆయనకు ఎంతో ఇష్టం అని బన్ని చెప్పారు. అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతుంటే, ఆయన మాత్రం ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యారని అన్నారు. 'నా ఫ్యాన్స్, నా ఆర్మీ ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా. నేను ఎప్పుడూ అంటున్నాను. అందరూ హీరోను చూసి ఫ్యాన్స్ అవుతుంటారు. కానీ, నేను నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యాను. థ్యాంక్యూ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. ఇంకోసారి ఇలా ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా, ఇంకెక్కువ కనబడతా' అని నవ్వుతూ అన్నారు.
అస్సలు తగ్గేదేలే
'సాధారణంగా ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే నేను భయపడతాను. సినిమా ఎలా ఉంది అనేది ప్రేక్షకులు చెప్పాల్సిన విషయం. అది నేను చెబితే డబ్బా కొట్టినట్లు ఉంటుంది. అందుకే సినిమా గురించి చెప్పాలంటే భయపడతా. కానీ, ఈ సినిమా (పుష్ప 2) వస్తున్న విధానం, మీ అందరికీ నచ్చుతుంది. ఎక్కువ చెప్పను. అదీ ఇదీ కాదు. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. ఈ మాట నా ఫ్యాన్స్‌కు మాత్రమే చెబుతున్నా' అని పుష్ప 2 గురించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
I Love You....
— Movies4u Official (@Movies4u_Officl) August 21, 2024
I Love You...
Na Fans ni Chusi Nenu Hero Ayyaa!#AlluArjun pic.twitter.com/UcfTHVSgqs
Annaaaaaaaaaa🥹 @alluarjun Love youuuuuuuuuu❤️🤗 pic.twitter.com/8kADy5P0WV
— ᴄʜɪɴɴᴀ AA ᶜᵘˡᵗ🐉 (@CHINNA745) August 21, 2024