ETV Bharat / entertainment

'అఖండ' సీక్వెల్ షూటింగ్ అప్పుడే! స్టోరీలో ఆ రెండు పాయింట్సే హైలైట్​! - Akhanda 2 Shooting - AKHANDA 2 SHOOTING

Akhanda 2 Shooting : నందమూరి బాలక‌ృష్ణ లీడ్ రోల్​లో రానున్న 'అఖండ 2' సినిమాపై తాజాగా ఓ అప్​డేట్​ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ?

Akhanda 2 Shooting
Akhanda 2 Shooting
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 12:37 PM IST

Akhanda 2 Shooting : నందమూరి బాలక‌ృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' సినిమా ఎంతటి సెన్సేషన్​ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం అప్పట్లోనే మంచి వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది. స్టోరీ, బాలయ్య యాక్టింగ్ ఇలా సినిమాలో పలు ప్లస్ పాయింట్స్ ఉండటం వల్ల ఈ చిత్రం అభిమానులకు బాగా రీచ్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్​ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా బోయపాటి కూడా ఈ మూవీకి సీక్వెల్ ఉండనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని, డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రీ పొడక్షన్ పనులు, ఎలక్షన్స్​ తర్వాత బాలయ్య కాల్షీట్స్ డేట్స్ ఫిక్స్ చేసుకుని ఈ​ షూటింగ్ సెప్టెంబర్​లో ప్రారంభించనున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాలో బాలయ్యా గతం కంటే విభిన్నంగా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. తొలి పార్ట్‌లో డ్యూయెల్ రోల్ పోషించగా, రానున్న సీక్వెల్‌లో అఘోరా పాత్రను ఇంకాస్త హైలెట్ చేయనున్నామని బోయపాటి వెల్లడించారు. అయితే ఈ స్టోరీ మొత్తం పూర్తిగా శైవత్వంపై సాగుతుందని, దక్షిణ భారతదేశంలో హిందూత్వానికి ఉన్న విలువలను చూపించే కోణంలో సీన్స్ ఉంటాయని సమాచారం. హిందూ దేవాలయాల గొప్పతనాన్ని వివరిస్తూనే దక్షిణ భారత దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే సన్నివేశాలను కూడా రూపొందించాలని మేకర్స్ అనుకుంటున్నారట.

ఇక అఖండ సినిమా విషయానికి వస్తే, తొలి పార్ట్​ను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రవీందర్ రెడ్డి నిర్మించగా, అఖండ 2 నిర్మాత ఎవరనేది ఇంకా సస్పెన్స్​గానే ఉంది. వాస్తవానికి రవీందర్ రెడ్డియే సీక్వెన్స్‌ను కూడా నిర్మించాలి. కానీ, భారీ బడ్జెట్ నేపథ్యంలో కొత్త నిర్మాతతోనే సీక్వెల్ నిర్మించాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అఖండ-2 రెడీ అయ్యే అవకాశముందనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి. ఒకవేళ మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ కేటాయించడానికి సిద్ధమైతే దీనికి కూడా ఆయనే నిర్మాత అవ్వొచ్చు.

సమాజానికి ఉపయోగపడేలా 'అఖండ 2' తీయాలనుకుంటున్నాను : బోయపాటి - Akhanda 2 Storyline

బాలయ్యపైనే ఆ హీరోయిన్ ఆశలన్నీ! - Balakrishna Akhanda 2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.