AHA New Movie Jai Balayya : తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే.ఎక్కడైనా జై బాలయ్య స్లోగన్ వినిపిస్తే చాలు వెంటనే అభిమానులు, ప్రేక్షకులు తిరిగి నినదిస్తారు. అందరితో శ్రుతి కలిపిస్తారు. ఇప్పుడు ఆ స్లోగన్ పలు సినిమాల్లో కూడా వినిపిస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఆహా అనౌన్స్ చేసిన కొత్త మూవీ పోస్టర్‌పై అదే స్లోగన్ ఉంది.
తెలుగు డిజిటల్ ఆడియన్స్ కోసం డిఫరెంట్ గేమ్ షోస్, రియాలిటీ షోస్, ఒరిజినల్ కంటెంట్ సినిమాలతో పాటు థియేట్రికల్ రిలీజ్స్ అందిస్తున్న తెలుగు ఓటీటీ ఆహా తాజాగా బాలు గాని టాకీస్ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఆ పోస్టర్ మీద 'జై బాలయ్య' అని రాసి ఉంది. ఆ సినిమాను విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా, శివ రామ చంద్రవరపు హీరోగా నటిస్తున్నారు. శ్రావ్య శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ ఇతరలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమ్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అయితే సినిమాలో హీరో పేరు బాలు. అతడు బాలకృష్ణకు వీరాభిమాని. అతడి థియేటర్ బాలు గాని టాకీస్‌లో బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటారు. థియేటర్ ఓనర్ బాలయ్య వీరాభిమాని, పైగా వేసేది అన్నీ బాలకృష్ణ సినిమాలే. అతడు ఫుల్ హ్యాపీ. మరి ప్రయాణంలో ఒడిదుడుకులు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.
అతి త్వరలో, మీ అభిమాన 'బాలుగానీ టాకీస్' లో!
— ahavideoin (@ahavideoIN) July 22, 2024
అందరూ జై బాలయ్య అంటూ రెడీ అయిపోండి!!#BaluGaniTalkies #AnAhaOrginialFilm @riseeastcre @kuncheraghu @SaranyaSharma_ pic.twitter.com/it7ylr8VMT
మరోవైపు, నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. గతేడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య, ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌తో తన 109వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అభిమానులతోపాటు సినీ ప్రియుల్లో ఉన్న అంచనాలను పెంచింది. 2024లోనే థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.
బాలయ్య సినిమా స్ఫూర్తితోనే కల్కి!: నాగ్ అశ్విన్ - Director Nag Ashwin