ETV Bharat / entertainment

ఇన్నేళ్లైనా అందాల నటి శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?

Actress Shobana Birthday Special : ఆమె కళ్లతోనే అభినయాన్ని పండించగలదు. 90స్​ యువత కలల రాకుమారి ఆమె. తన నటనతో ఎంతో మంది ఆకట్టుకుని అలనాటి స్టార్​డమ్​ను ఆస్వాదించింది. ఓ నటిగానే కాకుండా ఓ ప్రోఫషనల్ డ్యాన్సర్​గానూ తనను తాను నిరూపించుకుంది. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకుంది. అయితే ఆమె ఇప్పటి వరకు వివాహం చేసుకోసలేదు. దానికి ఆమె ఏమన్నారంటే ?

Actress Shobana Birthday Special
Actress Shobana Birthday Special
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 6:58 AM IST

Actress Shobana Birthday Special : 1970లో మార్చి 21న కేరళలో తిరువనంతపురం జిల్లాలో జన్మించింది శోభన. ట్రావెన్​కోర్ సిస్టర్స్​గా పేరొందిన లలిత, పద్మిని, రాగిణిలకు ఈమె మేనకోడలు. వీళ్లు మంచి క్లాసికల్ డ్యాన్సర్లు మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన 1984లో 'ఏప్రిల్ 18' అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్​గా మారింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 230 సినిమాల్లో నటించింది.

1994లో వచ్చిన 'మణిచిత్రతాఝు' అనే సినిమాలో శోభన నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాను కన్నడలో ఆప్తమిత్రగా, తమిళంలో చంద్రముఖిగా తర్వాత రీమేక్ చేశారు. ఆ తర్వాత నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్రా-మై ఫ్రెండ్ అనే ఇంగ్షీష్ సినిమాలో నటనకు మరో నేషనల్ అవార్డు వచ్చింది. ఇవే కాకుండా ఆమె కెరీర్​లో ఎన్నో స్టేట్ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఉన్నాయి. రెండోసారి జాతీయ పురస్కారం వచ్చిన దగ్గర నుంచి సినిమాలను జాగ్రతగా ఎంపిక చేసుకోవడం ప్రారంభించింది శోభన.

నటన మాత్రమే కాకుండా శోభన ఒక మంచి భరతనాట్యం డ్యాన్సర్ కూడా. చెన్నైలో చిత్ర విశ్వేస్వరన్ అనే గురువు దగ్గర నాట్యం నేర్చుకుంది. 1989లో డ్యాన్స్ స్కూల్ స్థాపించి కలిపిన్య అని పేరు పెట్టింది. ఆ తర్వాత 1994లో చెన్నైలో భరతనాట్యానికి ఒక డ్యాన్స్ స్కూల్ స్థాపించి దానికి కలర్పానా అని పేరు నామకరణం చేసింది. 1994 నుంచి సూర్యకృష్ణమూర్తి నిర్వహించే సూర్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఈవెంట్ లో నృత్యం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం సినిమాల కన్నా తన కళను ఎక్కువమందికి నేర్పించాలనే ఉద్దేశంతో భరతనాట్యం మీదే దృష్టి పెట్టారు ఆమె.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే చిత్ర పరిశ్రమలో వివాహం కాని నటీమణులలో శోభన ఒకరు. 50 ఏళ్లు వచ్చిన ఇంకా అదే అందాన్ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. ఆమెకు సంబంధించిన వింటేజ్ ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. కుర్రాళ్లు కూడా ఇంకా ఆమె అందానికి ఫిదా అవుతూనే ఉన్నారు. అయితే ఈమె మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ఆమెను ఎవరైనా అభిప్రాయం అడిగితే మాత్రం "పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో పెళ్లే కాదు చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగానే ఉన్నాను" అంటూ కచ్చితంగా చెప్పేస్తుంది. అయితే పెళ్లి బంధంతో సంబంధం లేకుండా 2011లో ఒక అమ్మాయిని దత్తత తీసుకుని సింగిల్ మదర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది శోభన.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్టూడియో ఫ్లోర్లను తుడిచే స్థాయి నుంచి స్టార్ హీరోయిన్​గా - ఎవరంటే?

ఆ ఒక్క కారణం వల్ల సల్మాన్ హీరోయిన్ సినిమాలకు దూరం! - ఏమైందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.