ETV Bharat / entertainment

సినిమాల కోసం చదువుకు ఫుల్​స్టాప్​ పెట్టిన మహేశ్ హీరోయిన్ - ఇప్పుడు ఏం చేస్తోందంటే? - Actress Left Studies For Movies - ACTRESS LEFT STUDIES FOR MOVIES

Actress Left Studies For Movies : కాలేజి రోజుల నుంచి కమర్షియల్ యాడ్స్‌లో కనిపించినా చదువు మీద ఫోకస్ వదల్లేదు. కానీ, సినిమా మీద ధ్యాస మళ్లిన తర్వాత చదువు మానేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే ఇప్పుడు సెలక్టివ్​ సినిమాల్లోనే కనిపిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరంటే?

Actress Left Studies For Movies
Actress Left Studies For Movies (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 4:22 PM IST

Actress Left Studies For Movies : సినిమానే తన కెరీర్ అని ఫిక్స్ అయిపోయి సైకాలజీ డిగ్రీకి ఫుల్​స్టాప్ పెట్టేసి మూవీస్‌లోకి వచ్చేసింది ఓ నటి. సినిమాల్లోకి రాకముందే కమర్షియల్ యాడ్స్‌లో కనిపించిన ఈ చిన్నది అనతికాలంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి పాపులర్ అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం సెలక్టివ్ రోల్స్​ చేసేందుకు ఇష్టపడుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

సోదరితో సినిమాల్లోకి ఎంట్రీ
అమృతా రావ్ అంటే అంతగా గుర్తుపట్టకపోవచ్చు కానీ 'అతిథి' సినిమా హీరోయిన్ అంతే ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ చిన్నది సినిమా ఎంట్రీ ఆసక్తికరంగా సాగింది. తన సోదరి ప్రీతికాతో కలిసి 'వోహ్ ప్యార్ మేరా' అనే మ్యూజిక్ వీడియోలో నటించింది అమృతా. అలా సినిమా ఇండస్ట్రీ వైపుకు అడుగులేసింది. ఆ తర్వాత 2002లో ఆర్య బబ్బార్‌తో కలిసి 'అబ్ కే బరస్​' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఇది తన డెబ్యూ మూవీ. తొలి చిత్రంతోనే అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత అజయ్ దేవగన్ సరసన ' ది లెజెండ్​ ఆఫ్​ భగత్ సింగ్'లో నటించింది. అప్పటి నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2003లో 'ఇష్క్ విష్క్‌', 2005లో 'వాహ్ లైఫ్ హో తో ఐసీ', 2006లో 'వివాహ్' సినిమాలో నటించింది. 'వివాహ్​' సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక సినిమాల్లోనే కాకుండా 2009లో పర్ఫెక్ట్ బ్రైడ్ అనే టెలివిజన్ షోలో జడ్జీగానూ వ్యవహరించింది.

పెళ్లి ఖర్చు రూ.1.5లక్షలు
2016లో ఆర్జే అన్మోల్‌ను వివాహం చేసుకుంది. వీళ్ల పెళ్లి కూడా అప్పట్లో టాక్ ఆఫ్​ ద టౌన్​గా మారింది. ఎందుకంటే ఈ జంట తమ వివాహం కోసం కేవలం రూ.1.5లక్షలు మాత్రమే వెచ్చించారట. ఈ విషయాన్ని హీరోయిన్ స్వయంగా వెల్లడించింది.

"నేను సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలనుకున్నా. అందుకే కేవలం రూ.3 వేలతో చీర కొనుక్కున్నాను. ఆర్టిఫీషియల్ జ్యూయలరీ అలంకరించుకున్నాను. పెళ్లి అనేది ప్రేమకు చిహ్నం మాత్రమే. అదేమీ ఆర్భాటంగా చూపించాల్సిన వేడుక కాదని నా అభిప్రాయం. కేవలం నా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పెళ్లికి రావాలనుకున్నాం. అందుకే ఎక్కువగా ఖర్చు చేయలేదు" అని చెప్పింది అమృతా.

అయితే ఇప్పుడీమె సెలక్టివ్ సినిమాల్లో కనిపించేందుకు ఇష్టపడుతోంది. 2019లో చివరిసారిగా 'థాక్రే' అనే సినిమాలో కనిపించిన ఈమె, ఇప్పుడు 'జాలీ LLB 3' అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యాక్టివ్​గా ఉంటుంది. తన భర్తతో కలిసి మోటివేషనల్ అలాగే కామెడీ వీడియోలు చేసి షేర్​ చేస్తుంటుంది.

మళ్లీ పెళ్లి చేసుకున్న 'మహేశ్​' హీరోయిన్​.. అసలు ట్విస్ట్​ తెలిస్తే!

మగబిడ్డకు జన్మనిచ్చిన 'అతిథి' హీరోయిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.